ETV Bharat / bharat

'బుల్లీబాయ్ యాప్ కేసు'లో మరొకరు అరెస్ట్​.. కేసు 'ఐఎఫ్​ఎస్​ఓ'కు బదిలీ - బుల్లీ బాయ్​ యాప్ కేసు

Bully Bai App Case: 'బుల్లీబాయ్ యాప్' కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు ముంబయికు చెందిన పోలీసులు. ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితురాలు శ్వేతాసింగ్(19)ను బుధవారం బాంద్రా కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఇంటిలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ యూనిట్​కు(ఐఎఫ్​ఎస్​ఓ)బదిలీచే శారు పోలీసులు.

Bully Bai app case
బుల్లీబాయ్ యాప్ కేసు
author img

By

Published : Jan 5, 2022, 12:48 PM IST

Bully Bai App Case: బుల్లీబాయ్ యాప్ కేసు విచారణలో భాగంగా మరొకరిని అరెస్ట్ చేశారు ముంబయి సైబర్ సెల్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతాసింగ్​(19)ను ఉత్తరాఖండ్​లో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో నిందితుడు విశాల్​ కుమామ్ ఝా(21)ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఐపీసీ ప్రకారం సెక్షన్ 509, 354ఏ కింద వీరిపై కేసు నమోదు చేశారు. శ్వేతను బుధవారం బాంద్రా కోర్టులో హాజరుపరచనున్నారు. వీరిద్దరికీ ఇదివరకే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. బుల్లీబాయ్ ట్విట్టర్​ ఖాతాను, అందులోని సమాచారాన్ని తొలగించాలని ఇప్పటికే పోలీసులు ట్విట్టర్​కు నోటీసులు పంపారు.

మరోవైపు బుల్లీబాయ్ యాప్ కేసును ఇంటిలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ యూనిట్​కు(ఐఎఫ్​ఎస్​ఓ) బదిలీ చేశారు పోలీసులు. ఈ మేరకు ఎంఎల్​ఏటీ నుంచి అనుమతి లభించింది. ఈ యాప్​పై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కేసును ఐఎఫ్​ఎస్​ఓకు అప్పచెప్పింది పోలీస్​ శాఖ.

బుల్లీబాయ్ యాప్​ ఉదంతం..

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొన్ని ఫొటోలను మార్చి దుండగులు బుల్లీ బాయ్‌ యాప్‌లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన ఫొటోలను మాత్రమే ఉంచుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం కూడా 'సలీ డీల్స్‌' పేరిట ఓ యాప్‌ ఇదే తరహా కార్యకలాపాలకు ఒడిగట్టింది. దీనిపై అప్పట్లో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అయితే, ఇప్పటి వరకు దుండగులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'గిట్‌హబ్‌' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.

ఇవీ చూడండి: Bulli Bai APP: ఆ యాప్​లో మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.