ETV Bharat / bharat

'బుల్లీ బాయ్​ యాప్​' కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్​ - దిల్లీ పోలీస్​

Bulli bai controversy: బుల్లీ బాయ్ యాప్​ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్​ బిష్ణోయ్​ని దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. అసోం నుంచి దిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Bulli Bai app case
'బుల్లీ బాయ్​ యాప్​' కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్​
author img

By

Published : Jan 6, 2022, 1:33 PM IST

Bulli bai controversy: బుల్లీ బాయ్‌ యాప్‌ కేసులో ప్రధాన కుట్రదారు నీరజ్‌ బిష్ణోయ్‌ను అరెస్ట్‌ చేసినట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇంతకుముందు బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి విశాల్‌ కుమార్‌ను, ఉత్తరాఖండ్‌లో శ్వేత సింగ్‌ను, మయాంక్‌ రావల్‌ను అరెస్ట్ చేశారు.

అసోంలోని దిగంబర్​ ప్రాంతానికి చెందిన నీరజ్​ బిష్ణోయ్​ను(20) కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. గురువారం అరెస్ట్​ చేశారు. ఇతడు భోపాల్​లోని వెల్లూర్​ ఇన్​స్టిట్యూట్​ ఆప్​ టెక్నాలజీలో బీటెక్​ విద్యార్ధిగా తెలిపారు.

"దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం ఐఎఫ్​ఎస్​ఓ.. నీరజ్​ బిష్ణోయ్​ని అసోంలో అరెస్ట్​ చేసింది. బుల్లి బాయ్​ యాప్​ కుట్రలో ప్రధాన నిందితుడు నీరజ్​. యాప్​ ట్విట్టర్​ ఖాతా నిర్వహించేది అతనే. దిల్లీకి తరలిస్తున్నాం."

- కేపీఎస్​ మల్హోత్రా, డీసీపీ(ఐఎఫ్​ఎస్​ఓ)

ఆన్‌లైన్​ వేలం కోసం ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలను బుల్లీ బాయ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయటంపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. ముంబయి సైబల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Bulli bai controversy: 'మహిళల వేలం' యాప్.. ఆమె పనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.