ఓ అత్యాచారం కేసులో ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ కోర్టు 52 రోజుల్లోనే తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి 30ఏళ్ల జైలుశిక్ష విధించింది. జనవరి 11న 13ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగిన ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. త్వరితగతిన తీర్పునిచ్చింది. దోషులకు రూ.50వేలు జరిమానా కూడా విధించింది. స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి పల్లవి అగర్వాల్... పోక్సో చట్టంను ఆధారంగా చేసుకొని తీర్పు ప్రకటించినట్లు వెల్లడించారు.
అత్యాచార ఘటన జనవరి 11న జరిగింది. అనంతరం తొమ్మిది రోజుల్లోనే పోలీసులు కోర్టుకు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
మరో కేసు....
ఉత్తర్‌ప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బల్లియా జిల్లాలోని ఖైరా మఠానికి చెందిన మహంత్ మౌని బాబాపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం వల్ల కోర్టు ఉత్తర్వులు ఆలస్యంగా వచ్చాయని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.