ETV Bharat / bharat

బుద్ధుని బోధనలు నేటికీ ఆచరణీయం: దలైలామా - బుద్ధిని బోధనలు

బుద్ధుని బోధనలు ప్రస్తుత పరిస్థితులకూ సరిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. బుద్ధుని జననం, జ్ఞానోదయానికి ప్రతీక అయిన బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Buddha's teachings still relevant
బుద్ధిని బోధనలకు ఇప్పటి పరిస్థితులకూ సరిపోతాయి
author img

By

Published : May 26, 2021, 1:54 PM IST

బుద్ధుని కాలంతో పోల్చితే ప్రపంచం ఇప్పుడు ఎంతో మారినప్పటికీ ఆయన బోధనల్లోని సారాంశం ప్రస్తుత పరిస్థితులకూ సరిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురవు దలైలామా అన్నారు. 2,600 ఏళ్ల క్రితం నాటి బుద్ధుని పాఠాలు నేటి తరానికి ఆచరణీయమని చెప్పారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా దలైలామా శుభాకాంక్షలు తెలిపారు.

" బుద్ధుని బోధనలు ఏ ఒక్క వర్గానికో, దేశానికో మాత్రమే కాదు. వివేకము గల అందరికీ ఆచరణీయం. ప్రజలు వారి సామర్థ్యం, అభిలాషకు అనుగుణంగా ఆయన మార్గాన్ని అనుసరించవచ్చు. నేను బాల్యం నుంచే బుద్ధ విద్య ప్రారంభించాను. నాకిప్పుడు 86 ఏళ్లు. అయినా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. అందుకే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా బౌద్ధులను ప్రోత్సహిస్తుంటా. బోధనల వాస్తవ ఆంతర్యం ఏంటి, వాటిని ఎలా పాటించాలని తెలుసుకోవడం కోసం 21వ శాతాబ్దపు బౌద్ధులను కలుస్తుంటాను. వినడం, చదవడం, ఏం విన్నాం? ఏం చదివాం? అని ఆలోచించడం ద్వారా వాటికి మీరు మరింత చేరువవుతారు."

-దలైలామా సందేశం

ఇదీ చూడండి: 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.