BSP Mayawati Heir Akash Anand : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆ పార్టీ షాజహాన్‌పుర్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వీర్ సింగ్ ఆదివారం ఈ విషయం వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మాయవతి ఆనంద్‌కు అప్పగించినట్లు తెలిపారు. లఖ్‌నవూలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆకాశ్ ఆనంద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వారసత్వ రాజకీయాల పట్ల ఎప్పుడూ విమర్శలు గుప్పించే మాయావతి 2019లో తన తమ్ముడు ఆనంద్ కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. తాజాగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తన వారసుడిగా ప్రకటించడం గమనార్హం.
"ఆకాశ్ ఆనంద్‌ను మాత్రమే తన వారసుడిగా ఆమె( మాయావతి) ప్రకటించారు. ఎందుకంటే ఆమె కీలక బాధ్యతలు అప్పగించిన వారు విధినిర్వహణలో విఫలమయ్యారు. ఆకాశ్ ముున్ముందు గొప్పనాయకుడిగా నిరూపించుకుంటారనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో నైతికతను పెంపొందించే బాధ్యతను పార్టీ ఆయనకు అప్పగించింది. "
-చౌదరి శీస్పాల్ సింగ్, బీఎస్పీ నేత
-
#WATCH | Lucknow, Uttar Pradesh | Bahujan Samaj Party (BSP) leader Udayveer Singh says, "BSP chief Mayawati has announced Akash Anand (Mayawati's nephew) as her successor..." pic.twitter.com/nT1jmAMI29
— ANI (@ANI) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Lucknow, Uttar Pradesh | Bahujan Samaj Party (BSP) leader Udayveer Singh says, "BSP chief Mayawati has announced Akash Anand (Mayawati's nephew) as her successor..." pic.twitter.com/nT1jmAMI29
— ANI (@ANI) December 10, 2023#WATCH | Lucknow, Uttar Pradesh | Bahujan Samaj Party (BSP) leader Udayveer Singh says, "BSP chief Mayawati has announced Akash Anand (Mayawati's nephew) as her successor..." pic.twitter.com/nT1jmAMI29
— ANI (@ANI) December 10, 2023
ఎవరీ ఆకాశ్ ఆనంద్?
Akash Anand Political Career : బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తమ్ముని కుమారుడే ఆకాశ్. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ ఆధ్వర్వంలో చేపట్టిన పాదయాత్రతోపాటు, ఇటీవల డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ పేరును ప్రకటించింది. ఇది పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న చర్చకు తెరదించినట్లైంది.