జమ్ముకశ్మీర్‌లోని పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు.. సాంబ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
ముందుగా హెచ్చరించినా చొరబాటుదారుడు అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాడని అధికారులు తెలిపారు. చొరబాటుదారుడి మృతదేహం ఇంకా ఘటనా స్థలంలోనే ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్ వైఫల్యంపై సమీక్ష జరపాలి'