భారత సరిహద్దు బలగాలు మరోసారి గొప్ప మనసు చాటుకున్నాయి. పొరపాటున.. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బాలుణ్ని.. శుక్రవారం రాత్రి ఆ దేశానికి తిరిగి అప్పగించారు జవాన్లు.
ఏం జరిగిందంటే?
దాయాది దేశానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు శుక్రవారం.. రాజస్థాన్లోని బాడ్మేర్ వద్ద భారత్లోకి ప్రవేశించాడు. అక్కడి జవాన్లు గుర్తించి.. ఆ అబ్బాయిని వెనక్కి వెళ్లమనగా.. బోరున ఏడ్చాడు. దీంతో ఆ బాలుణ్ని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఆకలితో ఉన్న అతడికి ఆహారం కూడా ఇచ్చారు. ఆ తర్వాత విచారించగా.. తనకేమీ తెలియదని, పొరపాటున వచ్చానని ఆ బాలుడు చెప్పాడు.
అనంతరం.. ఆ బాలుడ్నిఅప్పగించేందుకు సాయంత్రం 7:30 గంటలకు పాకిస్థాన్ రేంజర్లతో పతాక సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీఎస్ఎఫ్. భారత జవాన్లు ప్రతిస్పందించిన తీరును పొరుగు దేశం ప్రశంసించింది.
ఇదీ చదవండి: రాడార్లకు చిక్కని యుద్ధనౌకలు!