భారత సైనికులు మానవత్వాన్ని చాటుకున్నారు. దారి తప్పి భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మూడేళ్ల బాలుడిని బీఎస్ఎఫ్ జవాన్లు.. అతని కుటుంబానికి అప్పగించారు. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకి అనుకోకుండా పాక్‌కు చెందిన బాలుడు వచ్చేశాడు.
శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో అంతర్జాతీయ కంచె దగ్గర ఏడుస్తున్న బాలుడిని బీఎస్ఎఫ్ దళాలు గమనించాయి. అప్పటికే ఆ బాలుడు 'నాన్న నాన్న' అంటూ ఏడుస్తున్నాడు. అక్కడికి చేరుకున్న బీఎస్ఎఫ్ దళాలు.. బాలుడికి తినుబండారాలు, నీళ్లు ఇచ్చారు. అనంతరం పాకిస్థాన్ రేంజర్స్‌కు సమాచారం అందించారు. పాక్ రేంజర్ సమక్షంలో రాత్రి 9.45 నిమిషాలకు బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు.
ఇవీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..