ETV Bharat / bharat

తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్నబలి - హత్య వార్తలు

Brother Extra Marital Affair: తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్న బలయిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో ఓ కారుపై పెట్రోల్‌ పోసి కొందరు నిప్పంటించిన ఘటనలో సంచలన నిజాలు బయటపడ్డాయి. పురుషోత్తంపై కక్షగట్టిన ఆ మహిళ బంధువులు రాజీ కోసం పిలచి పురుషోత్తం అన్న నాగరాజును సజీవ దహనం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 2, 2023, 10:18 PM IST

Updated : Apr 3, 2023, 6:40 AM IST

Man burnt alive in Tirupati district: తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. తమ్ముడిని ఊరి నుంచి పంపాడనే కక్షతో.. అన్నను మాట్లాడదామని పిలిచి మంటల్లో తగలబటెట్టారు. కారుతోపాటే సజీవ దహనం చేశారు. తిరుపతి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో ఓ కారుపై పెట్రోల్‌ పోసి కొందరు నిప్పంటించారు. తగలబడుతున్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించి కారులో వ్యక్తి సజీవదహనమైనట్లు గుర్తించారు. కారు నంబర్‌, మృతుడి మెడలోని బంగారు గొలుసు ఆధారంగా.. చనిపోయింది వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా గుర్తించారు.

బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు నాగరాజుకు భార్య సులోచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ బంధువులు పురుషోత్తంపై కక్షగట్టారు. భయపడిన నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను ఊరుదాటించాడు.బెంగళూరుకుపంపాడు. సదరు మహిళ బంధువులతో సయోధ్య కోసం నాగరాజు ప్రయత్నిస్తున్నాడు. బెంగళూరు నుంచి తరచూ బ్రాహ్మణపల్లి వెళ్లొస్తుండేవాడు. ఈ క్రమంలోనే గోపి అనే వ్యక్తి ఫోన్‌ చేసి మహిళ తరపు వారితో మాట్లాడిస్తామని చెప్పడంతో తన భర్త వెళ్లాడని నాగరాజు భార్య తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే దుర్వార్త తెలిసిందని వాపోయారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తతోపాటుమరో వ్యక్తే ఈఘాతుకానికి ఒడిగట్టారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

గంగుడుపల్లెలో కారుతోపాటే నాగరాజు సజీవదహనం

'నా భర్త తమ్ముడు పురుషోత్తం.. గ్రామంలో ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ ఫ్యామిలి వాళ్లు మా మరిదిని చంపేస్తామని బెదిరించారు. వారికి భయపడి నా భర్త మా మరిదిని బెంగళూరుకు పంపించాడు. అనంతరం నా భర్త వారితో రాజీ కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజీకి వస్తాం అని గోపి అనే వ్యక్తికి చెప్పి నా భర్తను రమ్మన్నారు. ఆయన వెళ్లిన కొందిసేపటికే కారు మంటల్లో చిక్కుకుందని ఫోన్ వచ్చింది. మా ఆయన చావుకు వాళ్లే కారణం వాళ్లను కఠినంగా శిక్షించాలి. మా మరిదిని చంపేస్తామని బెదిరించడంతో వారితో సయోద్య కుదుర్చుకుందామని నాభర్త వస్తే ఆయనను ఇలా చంపేశారు. మా మరిది తప్పు చేస్తే నా భర్తను చంపేశారు. పోలీసులు ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.'- సులోచన, నాగరాజు భార్య

బాధితుల ఫిర్యాదు మేరకు వివాహేతర సంబంధం కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బాధితులు అనుమానం వ్యక్తం చేసిన ఒకరిలో రూపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 3, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.