Brother And Sister Meets After 76 Years : దేశ విభజన సమయంలో విడిపోయిన అన్నాచెల్లెళ్లు 76 తర్వాత మళ్లీ కలుసుకున్నారు. వారిని ఏకం చేసిన ఘనత సోషల్ మీడియాకే దక్కింది. మహమ్మద్ ఇస్మాయిల్, ఆయనకు వరుసకు సోదరైన సురీందర్ కౌర్ సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్నారు. ఈ క్రమంలో వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఏం జరిగిందంటే
భారత్-పాక్ విభజనకు ముందు మహమ్మద్ ఇస్మాయిల్, ఆయనకు వరుసకు సోదరైన సురీందర్ కౌర్ కుటుంబాలు జలందర్‌లోని షాకోట్ ప్రాంతంలో నివసించేవారు. ఇరు దేశాల మధ్య జరిగిన అల్లర్లు ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెంచాయి. దేశ విభజన తర్వాత మహమ్మద్ ఇస్మాయిల్.. పాకిస్థాన్.. పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఉంటున్న ప్రాంతం లాహోర్‌కు 200 కి.మీ దూరంలో ఉంది. ఆయన సోదరి సురీందర్ కౌర్.. జలందర్‌లో నివాసం ఉంటున్నారు. దూరంగా ఉండటం వల్ల ఒకరి వివరాలు మరొకరికి తెలియలేదు. అప్పటినుంచి ఇరు కుటుంబాలు పరస్పరం దూరమయ్యాయి.
ఇద్దర్ని ఒక్కచోటకు చేర్చిన యూట్యూబ్ ఛానెల్
ఏడు దశాబ్దాలుగా విడిపోయిన ఇస్మాయిల్, ఆయన సోదరిని ఒక్క చోటుకు చేర్చిన ఘనత సోషల్ మీడియాకే దక్కుతుంది. మహమ్మద్ ఇస్మాయిల్, సురీందర్ కౌర్‌ల దీనగాథపై ఓ పాకిస్థానీ-పంజాబీ యూట్యూబ్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. అది చూసిన ఆస్ట్రేలియాకు చెందిన సర్ధార్ మిషన్ సింగ్ భారత్‌లో నివసిస్తున్న సురీందర్ కౌర్ గురించి సమాచారాన్ని మహమ్మద్ ఇస్మాయిల్‌కు అందించారు. ఆమె ఫోన్ నంబర్‌ను ఇస్మాయిల్‌కు ఇచ్చాడు. మిషన్ సింగ్ ఇచ్చిన ఫోన్ నంబర్ సహాయంతో ఇస్మాయిల్ తన సోదరి సురీందర్ కౌర్‌తో మాట్లాడారు. దీంతో ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ వారి అన్నాచెల్లెళ్ల బంధం చిగురించినట్లైంది. వారిద్దరూ కలుసుకునేందుకు మార్గం సుగమమైంది. కర్తార్‌పుర్ కారిడార్‌లో ఇరు కుటుంబాలు కలవాలని నిర్ణయించుకున్నారు.
భావోద్వేగానికి గురైన అన్నా చెల్లెలు
76 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కలిసిన అన్నాచెల్లెళ్లు ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో ఇద్దరి కళ్లలోను నీళ్లు తిరిగాయి. వారితో పాటు అక్కడికి వచ్చిన మిగిలిన కుటుంబ సభ్యుల కళ్లు ఆనంద భాష్పాలతో తడిగా మారాయి. తర్వాత సురీందర్ కౌర్ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.
భారత్‌లో అన్న.. పాకిస్థాన్‌లో చెల్లి.. 76 ఏళ్ల తర్వాత కలుసుకొని తీవ్ర భావోద్వేగం.
భారత్‌లో అక్క.. పీఓకేలో తమ్ముడు.. 75 ఏళ్ల తర్వాత కలుసుకుని కన్నీళ్లు