ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం సంభవించి ధౌలీగంగాపై ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైనీ గ్రామంలో 200 అడుగుల పొడవుగల బెయిలీ రహదారి వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి, ప్రారంభించింది సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్ఓ).
ఫిబ్రవరి 7న ధౌలీగంగా, రిషిగంగా నదుల్లో వచ్చిన వరదలకు అంతకుముందున్న 90 అడుగుల పొడవున్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో 8 రోజుల్లోనే 200 అడుగుల పొడవు గల వంతెన నిర్మించింది బీఆర్ఓ.

