ETV Bharat / bharat

రెజ్లర్ల కేసులో బ్రిజ్ ​భూషణ్​కు కోర్టు సమన్లు.. జులై 18న ఏం జరగనుంది?

Brij Bhushan Singh Delhi Court : బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 18న హాజరు కావాలని ఆదేశించింది.

brij bhushan singh
brij bhushan singh
author img

By

Published : Jul 7, 2023, 6:18 PM IST

Updated : Jul 7, 2023, 6:50 PM IST

Brij Bhushan Singh Delhi Court : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితుడిపై దర్యాప్తు జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్.. బ్రిజ్ భూషణ్‌ను జులై 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

'నాకు ఏ మినహాయింపు అవసరం లేదు..'
కోర్టు సమన్లపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ స్పందించారు. జులై 18న విచారణకు హాజరు అవుతానని, తనకు ఏ మినహాయింపు అవసరం లేదని తెలిపారు.

Brij Bhushan Singh Delhi Police : బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు సెక్షన్‌ 354, 354-A సహా పలు సెక్షన్ల కింద జూన్ 15న ఛార్జిషీట్ దాఖలు చేశారు. 500 పేజీల ఛార్జ్​షీట్ దాఖలు చేసిన పోలీసులు.. మైనర్ ఆరోపణలపై నమోదైన కేసును రద్దు చేయాల్సిందిగా కోరారు. మైనర్ రెజ్లర్ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఛార్జ్​షీట్​లో పేర్కొన్నారు. బాలిక, ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోక్సో కేసు రద్దుకు సంబంధించి నివేదిక సమర్పిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. డబ్ల్యూఎఫ్​ఐ అసిస్టెంట్​ సెక్రటరీ వినోద్ తోమర్‌పై సెక్షన్‌ 109 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

"పోక్సో కేసు విషయానికి వస్తే.. మా విచారణ పూర్తైన తర్వాత సీఆర్​పీసీ సెక్షన్ 173 ప్రకారం కేసును రద్దు చేయాలని కోరుతూ నివేదిక సమర్పించాం. ఫిర్యాదుదారు (మైనర్ తండ్రి)తో పాటు బాధితురాలి స్టేట్​మెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇతర రెజ్లర్ల ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం ఛార్జ్​షీట్ దాఖలు చేశాం. సస్పెన్షన్​కు గురైన రెజ్లింగ్ ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమర్​పై ఐపీసీ సెక్షన్లు 109, 354, 354ఏ, 506 ప్రకారం ఛార్జ్​షీట్ నమోదు చేశాం"

-దిల్లీ పోలీసులు

రెజ్లర్ల ఆరోపణలు ఏంటంటే?
Wrestlers Protest : బ్రిజ్ భూషణ్ తమతో అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసులకు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. దగ్గరకు పిలిచి ఒంటిపై దుస్తులు లాగేవాడని ఆరోపించారు. శ్వాసక్రియను పరిశీలిస్తానని చెప్పి ఛాతిని తాకేవాడని ఓ రెజ్లర్ వాపోయారు. కోచ్ లేని సమయంలో తమను వేధింపులకు గురిచేసేవాడని మరో రెజ్లర్ పోలీసులకు తెలిపారు. అంతర్జాతీయ పోటీలో గాయపడ్డప్పుడు.. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులు ఫెడరేషన్ భరించేలా చూస్తానని బ్రిజ్ భూషణ్ చెప్పినట్లు మరో రెజ్లర్ ఆరోపించారు. అయితే, రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమైతే తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.

Last Updated : Jul 7, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.