ETV Bharat / bharat

'ముక్కు చిన్నగా ఉంది.. ఆ అబ్బాయి నాకు వద్దు!'.. మండపంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు - ముక్కు చిన్నదని పెళ్లికి నో

వరుడు ముక్కు చిన్నగా ఉందని పెళ్లికి నిరాకరించిన ఓ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సంభాల్​ జిల్లాలో జరిగింది. విషయం ఏమిటంటే..?

sambhal
సంభాల్​
author img

By

Published : Dec 8, 2022, 4:35 PM IST

మరికొద్ది నిమిషాల్లో పెళ్లనగా.. వరుడు మక్కు చిన్నగా ఉందని.. ఏకంగా పెళ్లే ఇష్టం లేదని బాంబు పేల్చింది వధువు. ఈ ఊహించని ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్​ జిల్లాలో వెలుగుచూసింది.
ఓ గ్రామంలో యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వరుడి కుటుంబం వధువు ఇంటికి బుధవారం ఊరేగింపుగా వచ్చింది. దీంతో అమ్మాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంతలోనే అక్కడ ఉన్న కొంత మంది మహిళలు వరుడి ముక్కు చాలా చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు.

ఇది విన్న వధువు అతడిని చూసేందుకు వెళ్లింది. నిజంగానే ముక్కు చిన్నగా ఉందని వెంటనే పెళ్లికి నిరాకరించింది. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉంది కాబట్టి తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వధువును ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా.. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అర్ధంతరంగా వివాహం ఆగిపోయింది. చేసేదేంలేక వధువు లేకుండానే వరుడు కుటుంబం బ్యాండ్ మేళంతో తిరిగి ఇంటికి వచ్చారు. ఇలాంటి కేసు ఎప్పుడూ తన దృష్టికి రాలేదని అస్మోలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు.

ఇదే తరహా వింత ఘటనే ఉన్నావ్​లోనూ జరిగింది. తెల్లవారుజూమున పెళ్లి అనగా వరుడు కాలు జారి కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి తల మీదున్న విగ్గు ఊడిపోయింది. అది చూసి పెళ్లి కూతురు, ఆమె బంధువులు కంగుతిన్నారు. తమను మోసం చేసి పెళ్లి చేయాలనుకున్నారని వరుడి కుటుంబసభ్యులతో గొడవకు దిగారు. చివరకు ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.