ETV Bharat / bharat

'నల్లగా ఉన్నాడు.. అతడితో పెళ్లి వద్దు'.. వేదికపైనే వధువు షాక్.. బంధువులు వారించినా.. - bride cancels marriage

కాసేపట్లో వివాహం అనగా.. కాబోయే భర్తకు షాక్ ఇచ్చింది వధువు. వివాహం చేసుకోనని మొండికేసింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వివాహానికి నిరాకరించింది. ఆ తర్వాత ఏమైందంటే?

bride-refused-to-marry-
bride-refused-to-marry-
author img

By

Published : May 17, 2023, 5:23 PM IST

వివాహానికి నిరాకరించిన వధువు

వరుడు నల్లగా ఉన్నాడని అతడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది వధువు. మెడలో పూలమాల వేసేముందు వివాహానికి అడ్డు చెప్పింది. అతడిని పెళ్లి చేసుకునేదే లేదని పట్టుబట్టింది. బంధువులు ఎంతగా వారించినా ఆమె మాట వినలేదు. బిహార్​ బాగల్​పుర్​లోని కహల్​గావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చివరికి ఏమైందంటే?

స్థానికంగా నివసించే వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారికి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్​తో పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వచ్చారు. వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వరుడు వివాహ వేదిక పైకి విచ్చేశాడు. కాబోయే వరుడిని చూడగానే యువతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు వివాహం జరగనుందనే ఆనందంతో సందడి చేసిన కిట్టూ కుమారి.. సడెన్​గా మనసు మార్చుకుంది. పెళ్లికి వచ్చినవారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి మెడలో దండ వేసేందుకు నిరాకరించింది. అతడికి తిలకం పెట్టేందుకు ససేమిరా అంది.

bride-refused-to-marry
వేదికపై వధూవరులు

వెంటనే ఇరు కుటుంబాలు రంగంలోకి దిగి.. వధువుకు ఏమైందోనని ఆరా తీశారు. ఎందుకు మారం చేస్తున్నావని యువతిని అడిగారు. వరుడి శరీర రంగు నల్లగా ఉండటం తనకు నచ్చలేదని యువతి సమాధానం ఇ్చచింది. వయసులో తన కన్నా చాలా పెద్దవాడిలా ఉన్నాడని బదులిచ్చింది. అందుకే ఈ వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పింది.

దీంతో వరుడి కుటుంబ సభ్యులు వధువుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు యువతికి పలు హామీలు ఇచ్చారు. వధువు కుటుంబ సభ్యులు సైతం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి వద్దని చెబితే వరుడిని అవమానానికి గురిచేసినట్లు అవుతుందని కిట్టూ కుమారితో వారించారు. అయినా యువతి వినలేదు. కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండిగా ప్రవర్తించింది. వెంటనే వేదిక నుంచి దూరంగా వచ్చేసింది. తన గదికి వెళ్లిపోయింది. వధువు తండ్రి సైతం ఎంతగా వారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

bride-refused-to-marry
వేదికపై వధూవరులు

బట్టతల ఉందని...
గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. బట్టతల ఉందని ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. వివాహం జరుగుతుండగా స్పృహ తప్పి పడిపోయిన పెళ్లి కొడుకును పైకి లేపుతుండగా.. అతడి విగ్గు ఊడిపోయింది. వరుడికి బట్టతల ఉందని చూసిన వధువు.. అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. ఈ పూర్తి కథనం, అందుకు సంబంధించిన చిత్రాలు చూసేందుకు లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.