ETV Bharat / bharat

'శృంగారంలో పాల్గొనకూడదు'.. వరుడికి 3 వింత కండీషన్స్​​.. నో చెప్పినందుకు పెళ్లి రద్దు

author img

By

Published : Jun 10, 2023, 12:02 PM IST

వధువు సవతి తండ్రి పెట్టిన వింత షరతుల వల్ల పెళ్లైన మరుసటి రోజే నూతన దంపతులు విడిపోవాల్సి వచ్చింది. దీంతో వరుడు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఈ ఘటనపై ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు. ఇంతకీ ఆ షరతులు ఏంటంటే..

wedding break up
వివాహం రద్దు చేసిన వధువు

పెళ్లై 24 గంటలు కూడా కాకముందే వధువు సవతి తండ్రి.. వరుడికి విచిత్రమైన షరతులు విధించాడు. ఆ కండీషన్స్​కు ఒప్పుకోని వరుడు బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వధువు తన భర్త ఇంటికి వెళ్లేందుకు నిరాకరించి.. పెళ్లినే రద్దు చేసుకుంది. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో జరిగింది.

ఇదీ కథ...
ఉత్తర్​ప్రదేశ్ ఝాన్సీ జిల్లా బారుసాగర్​కు చెందిన మన్వీంద్ర అనే యువకుడికి సమీప గ్రామ యువతి జ్యోతికి పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరికీ జూన్ 6వ తేదీన వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు సాయంత్రం జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొని.. సంతోషంగా వేడుకను జరుపుకొన్నారు. పెళ్లైన మరుసటి రోజు జూన్ 7వ తేదీన విదాయ్ (రిసెప్షన్) జరగాల్సి ఉంది. కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్న సమయంలో పెళ్లి కూతురు సవతి తండ్రి.. వరుడికి మూడు విచిత్రమైన షరతులు విధించాడు. 'వధూవరులిద్దరూ శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు.. పెళ్లైన తర్వాత వధువుతో పాటు అత్తారింటికి తన చెల్లెలు కూడా వస్తుంది.. వధువు తండ్రి ఏ సమయంలో అయినా తన కూతురు ఇంటికి వస్తాడు. ఆయణ్ని ఎవరూ ప్రశ్నించకూడదు' అంటూ వరుడికి కండీషన్స్ పెట్టాడు.

ఈ షరతులకు ఆశ్చర్యపోయిన వరుడు.. వాటిని అంగీకరించలేదు. దీంతో కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఫలితంగా వివాహం రద్దు చేసుకున్న పెళ్లి కూతురు.. తన చెల్లి, తండ్రితో పాటు ఇంటికి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగమంతా చూసి నోరెళ్లబెట్టడం వరుడి బంధువుల వంతు అయ్యింది. దీనిపై ఆగ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు స్థానిక బారుసాగర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వివాహ వేడుకలకు దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అయిందని, పెళ్లి కూతురుకు మూడు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు కానుకగా ఇచ్చామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పెళ్లి తర్వాత వధువు తండ్రి ఆభరణాలు తీసుకెళ్లాడు.

'పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది. వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. తర్వలోనే విచారణ జరుపుతాం'

- అజ్మీర్ సింగ్ భదోరియా, బారుసాగర్ పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వో.

వధువు ముఖంపై సింధూరం చల్లిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు కుటుంబ సభ్యులు ..
గత నెల ఉత్తర్​ప్రదేశ్​లో వింత ఘటన జరిగింది. వరుడి వికృతచేష్టలకు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది వధువు. దీంతో కల్యాణ మండపంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వధువు ముఖంపై వరుడు సింధూరం చల్లాడని పెళ్లి క్యాన్సిల్ చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఈ లింక్​ను క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.