ETV Bharat / bharat

కట్టుబాట్లు ఛేదిస్తూ.. మృతదేహాలను దహనం చేస్తూ..

తమ కుటుంబాన్ని పస్తుల బాధ నుంచి తప్పించడానికి డిగ్రీ చదివిన ఆమె.. శ్మశానవాటికలో అడుగుపెట్టారు. మృతదేహాలకు ఏ మాత్రం భయం లేకుండా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. కానీ, వాటికి తలొంచి అక్కడే ఆగిపోలేదామె. అందరూ చిన్నచూపు చూసే ఈ వృత్తిని ఎంతో అంకితభావంతో చేస్తున్నారు.

women in creamatorium
శ్మశనవాటికలో మహిళ విధులు
author img

By

Published : Jun 7, 2021, 5:01 PM IST

Updated : Jun 7, 2021, 5:51 PM IST

శ్మశానవాటికలో పని చేస్తున్న సుబీనా

శ్మశాన వాటికల్లో మృతుల అంతిమసంస్కారాలను ఎక్కడైనా.. పురుషులే నిర్వహిస్తారు. కానీ, కేరళలో ఓ మహిళ ఈ సామాజిక కట్టుబాట్లను తెంచి, తానూ ఈ పుణ్య కార్యాన్ని నిర్వహించటంలో నిమగ్నమయ్యారు. త్రిస్సూర్​ జిల్లాకు చెందిన సుబీనా అనే మహిళ.. శ్మశానవాటికలో మృతదేహాలను దహనం చేస్తున్నారు. లింగ వివక్షనే కాకుండా.. మతపరంగా ఉన్న అడ్డంకులనూ ఛేదించి ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

'నువ్వు మహిళవేనా? అన్నారు'

చాలా మంది ఈ వృత్తిని చిన్నచూపుతో చూస్తున్న తరుణంలో... సుబీనా మాత్రం గర్వంతో, అంకిత భావంతో పని చేస్తున్నారు. ముస్లిం మహిళ అయిన ఆమె ఈ పనిలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది ఆమెను 'నువ్వు ముస్లింవేనా? మహిళవేనా?' అని సూటిపోటి ప్రశ్నలతో వేధించారు. అయితే.. ఇన్ని సవాళ్లెదురైనా ఆమె ఈ వృత్తి ఎంచుకోవడానికి ప్రధాన కారణం 'ఆకలి'.

women in creamatorium
అస్థికలను సేకరిస్తున్న సుబీనా

ఓ చెట్టు కొమ్మ నరుకుతూ కింద పడగా సుబీనా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఐదు సార్లు సర్జరీ నిర్వహించారు. దాంతో సుబీనా కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తన చెల్లెలి వివాహ బాధ్యతలు కూడా సుబీనా మీదే పడ్డాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ.. సుబీనాకు అండగా ఆమె భర్త నిలుచున్నారు. తాను శ్మశానవాటికలో పని చేసేందుకు వెళ్తానన్నప్పుడు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు.

women in creamatorium
శ్మశానవాటికలో యంత్రాలను నడుపుతున్న సుబీనా

అనవసరపు ఆలోచనలు కట్టిపెట్టి..

కామర్స్​లో డిగ్రీ పూర్తి చేసిన సుబీనాకు.. ఇరింగలక్కుడా ముక్తిస్థాన్​ అనే శ్మశానవాటికలో పని చేసేందుకు అవకాశం ఉందని తెలిసింది. అనవసరపు ఆలోచనలు చేయకుండా ఆ పని చేసేందుకు సుబీనా ముందుకొచ్చారు. మృతదేహాలను చూసినప్పుడు భయపడతారా? అని ఆమెను ప్రశ్నించగా చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు. తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదని ఖాళీగా ఉండిపోతున్న ఎంతో మంది యవతకు సుబీనా ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: రూ.80వేలకు కోడలిని అమ్మేసిన మామ!

ఇదీ చూడండి: కాలిన గాయాలతో తల్లి.. సాయానికి బాలుడి వినతి

Last Updated : Jun 7, 2021, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.