ETV Bharat / bharat

ప్రేయసిపై స్నేహితులతో కలిసి ప్రియుడి గ్యాంగ్​ రేప్​ - లఖ్​నవూలో యువతిపై లైంగిక వేధింపులు

ప్రేమించిన వాడే ఆ యువతి పాట్ల అమానుషంగా వ్యవహరించాడు. స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి స్కెచ్​ వేశాడు. ఇవన్నీ తెలియని ఆ యువతి అతడి మాట విని వెళ్లి, మోసపోయింది.

Boyfriend gang raped girl  in firozabad
Boyfriend gang raped girl
author img

By

Published : Nov 17, 2022, 1:00 PM IST

ప్రేమించిన వాడే ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. తనతో పాటు వచ్చిన ఆ యువతిపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ ఘటనను చిత్రీకరించిన ప్రబుద్ధులు దాన్ని సామాజిక మాధ్యామల్లో పోస్ట్​ చేస్తామని యువతిని బెదిరించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో జరిగింది.

తుండ్లా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి, ఉత్తర కోత్వాలీలో నివాసం ఉంటున్న రవి అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడాలనుకున్న యువకుడు ఓ స్కెచ్​ వేశాడు. దాని ప్రకారం ఆమెను ఊరి బయటకు రమ్మని పిలిచాడు. అతడి మాటలు విన్న ఆ యువతిని.. రవి స్నేహితులు కొంత మంది వచ్చి అతడి వద్దకు తీసుకెళ్తామని నమ్మబలికారు.

రవి, మరో ముగ్గురు కలిసి ఆమెను ఆగ్రాలోని ఓ హోటల్​కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన యువతిని వీడియోలు చూపించి బెదిరించేందుకు ప్రయత్నించగా ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్​ చేశారు.

ఆర్మీ అధికారి కుమార్తెపై లైంగిక వేధింపులు..
దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లోని ఓ సీనియర్ మహిళా అధికారి కుమార్తెను ఓ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. యువతిని ఓ ప్రదేశంలో వదిలేసిన దుండగులు.. తన వద్దనున్న 500 రూపాయలతో పాటు ఓ క్రెడిట్​ కార్డును లాక్కుని అక్కడ నుంచి పరారయ్యారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని లఖ్​నవూలో నవంబర్​ 8న జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. లఖ్​నవూలోని ఎస్​జీపీజీఐ పరిధిలోని ఓ దుకాణానికి వస్తువులు కొనేందుకు ఆ యువతి వెళ్లింది. అయితే అమ్మాయి ఎంతకీ రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తనకు ఫోన్​ చేయగా స్విచ్​ ఆఫ్​ అని వచ్చింది. దీంతో ఆమెను వెతుక్కంటూ తల్లి షాప్​ వద్దకు వెళ్లగా యువతి అక్కడికి వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది.

అలా అమ్మాయి ఆచూకీ కనుగునేందుకు తెలిబాఘ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తల్లికి.. గోమతి నగర్​లోని ఫన్​ రిపబ్లిక్​ పోలీస్​ అవుట్​ పోస్ట్​ వద్ద యువతి కనిపించిందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్​ వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లికి దీన స్థితిలో ఆ యువతి కనిపించింది. తల్లిని చూసిన ఆ యువతి బోరున విలపించింది. ఈ విషయంపై యువతి తల్లి ఫిర్యాదును నమోదు చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్​ల ద్వారా కారు నంబర్​ను ట్రేస్​ చేసి నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఉదయం నుంచే ఓ యువకుడు నా కదలికలను గమనిస్తున్నాడు. తెలిబాఘ్​కు వెళ్తున్న సమయంలో నేను అతడ్ని ఆకాశ్​ ఎన్​క్లేవ్​ వద్ద బైక్​పై కూర్చుని ఉన్నప్పుడు గమనించాను. భయమేసి నేను షాపులో వస్తువులు కొనుక్కోకుండా ఆటో ఎక్కేశాను. ఆటో దిగి కొంత దూరం నడుస్తుండగా ఓ వ్యాన్​ నా దగ్గరకు వచ్చింది. అందులో ఉన్న ఆ యువకుడు నన్ను లోపలకు లాగాడు. వ్యాన్​లో నాపై లైంగిక వేధింపులకు పాల్పడి నా దుస్తులను చించేశాడు. అలా కాసేపు తిరిగాక ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ నన్ను పడేశారు. నా దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఓ క్రెడిట్​ కార్డును లాక్కెళ్లి అక్కడ నుంచి పరారయ్యారు. గాయాలతోనే ఎలాగోలా కొంత దూరం నడిచి ఓ వ్యక్తిని లిఫ్ట్​ అడిగాను. అతను నన్ను ఫన్​ రిపబ్లిక్​ అవుట్​ పోస్ట్​ వద్ద డ్రాప్​ చేసి వెళ్లాడు.

--బాధితురాలు

మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్​..
రోగులకు అనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్​ చేస్తున్న ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్​ థియేటర్​లో నొప్పి భరించలేక రోగులు అరుస్తుంటే.. ఆ కేకలతో ఆస్పత్రి ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. అయినా కానీ చలించని ఆ సిబ్బంది మిగతా పేషంట్లను బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్​ చేస్తున్నారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

ఖగారియాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు 30 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేసేందుకు టార్గెట్​ పెట్టుకున్నారు. అయితే అందులో 23 మందికి మత్తుమందు ఇవ్వకుండానే బలవంతంగా ఆపరేషన్​ చేశారు. ఇది చూసిన మరో 7 మంది అక్కడ నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారమంతా చీఫ్​ సర్జన్​ దృష్టికి వెళ్లగా..ఆయన దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని అలాగే బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.