ETV Bharat / bharat

ప్రశాంత్​ కిశోర్ ఇంటి ప్రహరి కూల్చివేత - ప్రశాంత్​ కిశోర్​ కూల్చివేత

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ పూర్వీకుల ఇంటి ప్రహరీని బిహార్ అధికారులు కూల్చివేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

bauxar, bihar, prashant kishore
ప్రశాంత్​ కిశోర్ ఇల్లు కూల్చివేత!
author img

By

Published : Feb 13, 2021, 8:20 PM IST

బిహార్​లోని బక్సర్​ జిల్లా అహిరౌలీ గ్రామంలో ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పూర్వికుల ఇంటి ప్రహరీని అధికారులు శుక్రవారం కూల్చివేశారు. భవనం ప్రహరి గోడ, గేట్లను బుల్​డోజర్​ సాయంతో తొలగించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ప్రశాంత్​ కిశోర్ ఇంటి ప్రహారి కూల్చివేత

నోటీసులు పంపించాము..

ఈ ఇంటిని ప్రశాంత్​ కిశోర్ తండ్రి నిర్మించారని.. ఆయన చనిపోయాక ఇక్కడ ఎవరూ నివసించట్లేదని ఇంటి కాపలాదారులు వెల్లడించారు. ఈ చర్యలకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ కిశోర్​కు సమాచారం అందించామని అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంత్​ నష్టపరిహారాన్ని తీసుకునేందుకు తిరస్కరించారని పేర్కొన్నారు. భవన ప్రాంగణంలో కొంత భాగాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఇకపై డీఎంకే అధినేత స్టాలిన్​కు అండగా పీకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.