ETV Bharat / bharat

'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం - తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

ఎన్నికల్లో ఎప్పుడూ ఢీ అంటే ఢీ అంటూ పోరాడే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు.. తమిళవాదంపై మాత్రం ఒకే బాటలో వెళ్తున్నాయి. తమ సిద్ధాంతకర్తలైన పెరియార్‌, అన్నాదురైలను అనుసరిస్తూ.. ద్రవిడ వాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యారంగం, పౌరసత్వ చట్టంపై ఇరు పార్టీలూ ఒకటే వైఖరిని కనబరుస్తున్నాయి.

both dmk and anna dmk parties are questiong central governments in same issues ahead of Tamil Nadu polls
తమిళవాదంపై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం
author img

By

Published : Mar 19, 2021, 7:22 AM IST

రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే తమిళవాదంపై మాత్రం ఒకే స్వరాన్ని వినిపిస్తున్నాయి. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చాటిచెప్తున్నాయి. తమ సిద్ధాంతకర్తలైన పెరియార్‌, అన్నాదురై బాటలో ప్రయాణిస్తూ.. ద్రవిడ వాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం విషయంలో ఇరు పార్టీలదీ ఒకటే మాట. ఆ రంగాన్ని ఉమ్మడి జాబితా నుంచి తప్పించి, రాష్ట్ర జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా రెండింటిదీ ఒకటే వైఖరి! ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏను రద్దు చేయాలని డీఎంకే డిమాండ్‌ చేస్తుండగా.. ఆ చట్టం అమలును నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని అన్నాడీఎంకే తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మిత్రపక్షమైన అన్నాడీఎంకే తమను సంప్రదించకుండానే ఆ అంశాన్ని ఎన్నికల హామీల్లో చేర్చడంపై భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భాజపాతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమేనని, సైద్ధాంతికంగా కాదని అన్నాడీఎంకే అగ్ర నేత, సీఎం పళనిస్వామి ఇటీవల స్పష్టం చేయడం గమనార్హం.

అన్నాడీఎంకే ప్రాధాన్య అంశాల్లో కొన్ని..

  • కచ్ఛదీవిని తిరిగి పొందేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సుప్రీం కోర్టులో దావా వేసిన నేపథ్యంలో న్యాయ పోరాటాన్ని కొనసాగించడం. శ్రీలంకలోని జాఫ్నాకు సమీపంలో ఉన్న కచ్ఛదీవి 1974లో భారత్‌ అధీనం నుంచి శ్రీలంక పరిధిలోకి వెళ్లిన సంగతి గమనార్హం.
  • ద్విభాషా సూత్రం కొనసాగింపు, ప్రాచీన భాష తమిళాన్ని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా అమలుచేయడం. ఐచ్ఛికం లేకుండా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి వరకు తమిళ భాషా పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేయడం.
  • శ్రీలంకలో తమిళులకు జీవనహక్కు కల్పించేందుకు కృషిచేయడం. అక్కడ తమిళుల ఊచకోత, అత్యాచారాల వంటి దారుణ కాండల బాధిత తమిళులకు తగిన న్యాయం జరిగేలా చూడటం. తమిళ ఈళ ప్రజలు స్వతంత్రంగా జీవించడానికి, ప్రత్యేక ఈళం ఏర్పాటు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) లేదా ఐఐఐఎం (ఇంటర్నేషనల్‌ ఇంపార్షియల్‌ ఇండిపెండెంట్‌ మెకానిజం) కోసం డిమాండ్‌ చేయడం.
    డీఎంకే ప్రాధాన్య అంశాల్లో కొన్ని..
  • ప్రాచీన తమిళ పరిశోధన కేంద్ర సంస్థ స్వయం ప్రతిపత్తి పొందిన సంస్థగా చెన్నైలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవడం.
  • రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో 'సెమ్మొళి పూంగ' (ప్రాచీన పార్కు)లను ఏర్పాటుచేయడం.
  • శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు, ఊచకోతపై విశ్వసనీయతతో కూడిన స్వతంత్ర విచారణ చేపట్టాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాలంటూ కేంద్రాన్ని డిమాండ్‌ చేయడం.
    వీటిపై ఉమ్మడిగా..
  • ప్రస్తుతం విద్యారంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. దాన్ని పూర్తిగా రాష్ట్రాల పరిధిలో చేర్చాలని అన్నాడీఎంకే, డీఎంకే డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన నీట్‌ ద్వారా వైౖద్య విద్యలో ప్రవేశాలు కల్పిస్తుండటాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
  • మద్రాసు హైకోర్టులో వ్యాజ్య భాష (వాదనలు వినిపించడం)గా తమిళాన్ని అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. హైకోర్టులో తమిళం ఉపయోగానికి అనుమతి కోరుతూ 2006లోనే ఓ తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఇది సాధ్యం కాదని కేంద్రానికి అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాశారు.
  • తమిళ ప్రాచీన కవి తిరువళ్లువర్‌ ద్విపదలో రచించిన 1,330 పద్యాల గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించేందుకు కృషి చేయడం.
  • రాష్ట్రంలోని కేంద్ర పభుత్వ/ ప్రభుత్వ అనుబంధ సంస్థ(బ్యాంకులు, ఇతర)ల్లో ప్రకటనల విడుదలకు సంబంధించి తమిళ భాషను అధికార భాషగా మార్చడం.
  • ప్రవాస తమిళుల పరిరక్షణ.
  • మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఏడుగురు తమిళుల విడుదలకు డిమాండ్‌. ఆ ఏడుగురు దాదాపు 30 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని విడుదల చేయాలంటూ కొన్నేళ్లుగా తమిళ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 2018 సెప్టెంబరులో రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు తీర్మానం చేసి గవర్నరు ఆమోదం కోసం పంపింది. రెండేళ్లు గడిచినా దానిపై గవర్నర్‌ నిర్ణయం తెలియకపోవడంతో దోషుల్లో ఒకరైన పేరరివాళన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి : సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్​- భాజపా పరేషాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.