ETV Bharat / bharat

బోరుబావిలో పడి చిన్నారి మృతి.. రెస్క్యూ సిబ్బంది 16గంటలు శ్రమించినా...

Borewell Boy died: మధ్యప్రదేశ్​లో పొరపాటున బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించిన అధికారులు.. చిన్నారిని బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

Borewell Boy died
Borewell Boy died
author img

By

Published : Feb 25, 2022, 3:29 PM IST

Borewell Boy died: మధ్యప్రదేశ్​ ఉమరియా జిల్లాలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడిని అధికారులు రక్షించలేకపోయారు. 16 గంటలకుపైగా నిర్విరామంగా సహాయకచర్యలు చేపట్టినా.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.

ఆడుకుంటూ బోరుబావిలో పడి..

జిల్లాలోని బడ్చడ్​ గ్రామానికి చెందిన గౌరవ్​ అనే బాలుడు గురువారం సాయంత్రం.. ఆడుకుంటూ పొలంలోకి వెళ్లాడు. అక్కడే అకస్మాత్తుగా బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బలగాలు ​సహాయక చర్యలు చేపట్టాయి. ముందుగా బోరులో ఉన్న చిన్నారికి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మూడు నాలుగు జేసీబీలతో బోరుకు సమాంతరంగా తవ్వే పనులను ప్రారంభించారు.

అలా జరిగిందని తెలిసినా..!

బోరు బావిలో పడిన ఆ బాలుడు 8 నుంచి 10 గంటల తర్వాత చనిపోయినట్లు వైద్యులు భావించారు. అయితే ఏదోమూల చిన్న ఆశతో తీవ్ర ప్రయత్నాలు చేశారు సహాయక సిబ్బంది. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించిన అధికారులు.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గౌరవ్​ను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధరించారు. నీటిలో మునిగిపోవడం వల్ల ఊపిరి ఆడక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇటువంటి ఘటనే గతేడాది ఛత్తర్​పుర్​ జిల్లా దౌనీ గ్రామంలో జరిగింది. ఓ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సురక్షితంగా బయటకు తీశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

ఇదీ చూడండి: 'దేశ రక్షణకు సైబర్​ భద్రతే కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.