ఎన్సీబీ అధికారులపై ఇకముందు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలేవీ (sameer Wankhede news) చేయకుండా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను నిలువరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై అత్యవసర విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం బుధవారం నిరాకరించింది. అవసరమైతే సెలవుకాలీన ధర్మాసనాన్ని సంప్రదించాలని, లేదంటే దీపావళి సెలవుల తర్వాత రెగ్యులర్ కోర్టులు పునఃప్రారంభమయ్యే వరకు ఆగాలని పిటిషన్‌దారుకు సూచించింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే లక్ష్యంగా మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎన్సీబీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik Sameer Wankhede).. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. వాంఖడే మోసపూరితంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించి.. ఉద్యోగం పొందారని మాలిక్ (Nawab Malik news) ఆరోపించారు. వాంఖడే మొదటి వివాహానికి సంబంధించిన ఫొటో, 'నిఖా నామా' స్క్రీన్షాట్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాను ట్విట్టర్లో పోస్ట్ చేసిన 'నిఖా నామా', జనన ధ్రువీకరణ పత్రాలు తప్పని తేలితే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. సమీర్ వాంఖడే (NCB Sameer Wankhede) రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. చట్టప్రకారమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు.
వాంఖడేపై ఇదివరకూ పలు ఆరోపణలు చేశారు మాలిక్. తప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించారని ట్వీట్లు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవారని ఓ లేఖను విడుదల చేశారు.
ముంబయి క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసును సమీర్ వాంఖడే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:వాంఖడేపై దర్యాప్తు షురూ- వాంగ్మూలం నమోదు చేసిన ఎన్సీబీ