ETV Bharat / bharat

ఏకధాటిగా 12గంటలపాటు విచారించిన హైకోర్టు

బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం బుధవారం 12 గంటల పాటు విచారణ చేపట్టింది. విచారణను వర్చువల్​గా చేపడుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులు భోజన విరామం కూడా తీసుకోకుండా 80 కేసుల వాదనలు విన్నారు.

bombay high court vacation bench, marathon hearing bombay hc
బాంబే హైకోర్టు
author img

By

Published : May 20, 2021, 12:44 PM IST

Updated : May 20, 2021, 12:49 PM IST

బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం బుధవారం ఏకధాటిగా 12 గంటల పాటు విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎస్​జే ఖతావాలా, జస్టిస్​ ఎస్​పీ తావ్డేతో కూడిన ధర్మాసనం ఉదయం 10.45కి ప్రారంభించి రాత్రి 11.15 వరకు విచారణలను కొనసాగించింది. వర్చువల్​గా చేపడుతున్న ఈ విచారణల్లో న్యాయమూర్తులు భోజన విరామం కూడా తీసుకోకుండా 80 కేసులకు సంబంధించిన వాదనలు విన్నారు. కేవలం సాయంత్రం ఓసారి టీ బ్రేక్​ తీసుకున్నట్టు సమాచారం.

వీటిలో ఎల్గార్​ పరిషత్​​ నిందితుల బెయిల్​, చికిత్స సహా మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులను కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇదివరకు కూడా జస్టిస్​ ఎస్​జే ఖతావాలా ఇలాగే విచారణ చేపట్టారు. 2018 మే నెలలో తెల్లవారుజామున 3.30 గంటల వరకు వాదనలను విన్నారు.

ఇదీ చదవండి : పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడి ముఖ్యం!

Last Updated : May 20, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.