ETV Bharat / bharat

సన్నీ లియోనీ ఫ్యాషన్ షో సమీపంలో బాంబు పేలుడు.. చైనా గ్రెనేడ్​తో దాడి!

మణిపుర్​లో భారీ పేలుడు సంభవించింది. సన్ని లియోనీ హాజరు కావల్సి ఉన్న ఓ ఫ్యాషన్​ షో ప్రాంగణానికి దగ్గర్లో బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఈ ఘటన జరిగింది.

Etv bomb-blast-near-sunny-leone-fashion-show-venue-in-imphal-manipur
Etv సన్నీ లియోన్ ఫ్యాషన్ షో దగ్గర భారీ బాంబు పేలుడు
author img

By

Published : Feb 4, 2023, 12:15 PM IST

Updated : Feb 4, 2023, 1:50 PM IST

ప్రముఖ సెలెబ్రిటీ సన్ని లియోనీ హాజరు కావల్సి ఉన్న ఓ ఫ్యాషన్​ షో ప్రాంగణానికి దగ్గరలో బాంబు పేలింది. దీంతో ఆ ఫ్యాషన్​ షో అర్ధాంతరంగా ఆగిపోయింది. మణిపుర్​ రాజధాని ఇంఫాల్ నగరంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ప్రజలు ఒక్కసారిగా భయందోళనలనకు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హప్తా కాంగ్జేబుంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఫ్యాషన్​ షో ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఇంఫాల్ ఈస్ట్​ ఎస్పీ మహారాబం ప్రదీప్ సింగ్ తెలిపారు. పేలుడుకు చైనీస్​ గ్రెనేడ్​ను వినియోగించినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదని ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Feb 4, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.