ETV Bharat / bharat

హైదర్​పొరా ఎన్​కౌంటర్​.. మృతదేహాలను కుటుంబాలకు అందజేత

author img

By

Published : Nov 19, 2021, 12:06 AM IST

Updated : Nov 19, 2021, 5:24 AM IST

జమ్ము కశ్మీర్ హైదర్​పొరా ఎన్​కౌంటర్​లో(Hyderpora encounter news) మృతిచెందిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. వాటిని గురువారం రాత్రి సంబంధిత కుటుంబసభ్యులకు అందించారు.

Hyderpora encounter
హైదర్​పొరా ఎన్​కౌంటర్

జమ్ము కశ్మీర్ హైదర్​పొరా ఎన్​కౌంటర్​లో(Hyderpora encounter news) ఉగ్రవాదులతో పాటు మృతిచెందిన అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్.. మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. సూర్యాస్తమయం తర్వాత శవాలను వెలికితీసిన పోలీసులు గురువారం రాత్రి.. వాటిని సంబంధిత కుటుంబసభ్యులకు అందించారు.

కొవిడ్​-19 మహమ్మారి తర్వాత.. ఖననం చేసిన మృతదేహాలను వెలికితీయటం ఇది మొదటిసారని.. అధికారులు తెలిపారు. పోలీసు బృందం ఆధ్వర్యంలో శవాలను హంద్వారా నుంచి శ్రీనగర్​కు తరలించారు.

ఏం జరిగిందంటే?

సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో(Hyderpora encounter news) ఓ పాకిస్థాన్ ఉగ్రవాదితో పాటు అతడి అనుచరుడు మహమ్మద్ ఆమిర్​ను బలగాలు హతమార్చాయి. వారితో పాటు ఉన్న అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్ సైతం ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదర్​పొరాలో ఓ అక్రమ కాల్​సెంటర్​, ఉగ్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

అల్తాఫ్, ముదాసిర్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరూ అమాయకులని అంటున్నారు. తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేశారు.

అయితే, శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎన్​కౌంటర్​లో మరణించిన నలుగురికి కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: హైదర్​పొరా ఎన్​కౌంటర్​పై కశ్మీర్​లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు

Last Updated : Nov 19, 2021, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.