ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. బావిలో డిప్యూటీ MRO కారు బోల్తా.. నలుగురు మృతి

author img

By

Published : Dec 12, 2022, 5:43 PM IST

Updated : Dec 12, 2022, 5:53 PM IST

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ డిప్యూటీ తహసీల్దార్​ కారు అదుపు తప్పి బావిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

bodies of missing people
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు బావిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ఉమర్‌కోట్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సపన్ సర్కార్​, అతడి భార్య రీటా సర్కార్​.. ఓ వివాహానికి ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​కు వెళ్లారు. వివాహం అయ్యాక మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి రాత్రి 10.30 గంటల సమయంలో బయలుదేరారు. అయితే బయలుదేరి చాలా సమయం అయిన ఇంటికి చేరకపోవడం వల్ల కుటుంబసభ్యులు భయపడ్డారు. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా మొబైల్స్​ స్విచ్​ ఆఫ్​ వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. కుటుంబసభ్యులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కాంకేర్‌ పరిసరాల్లో మొబైల్ లొకేషన్ ఆధారంగా బావిలో పడిన కారును గుర్తించారు. వెంటనే నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్రేన్​ సహాయంతో కారును బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. రీటా సర్కార్​ రూ.3 లక్షల విలువైన బంగారాన్ని ధరించినట్లు తెలుస్తోంది. వీళ్ల వద్ద సుమారు రూ.20 వేల నగదు కూడా ఉంది. అయితే ఇది నిజంగా రోడ్డు ప్రమాదమా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Last Updated : Dec 12, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.