ఉత్తర్ప్రదేశ్లో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పొలంలోని ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
పిలిభిత్ జిల్లా బిసాల్పుర్లోని ఓ పొలంలో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతులిద్దరూ సోమవారం నుంచి కనిపించకుండా పోయారని వెల్లడించారు.
![Bodies of 2 sisters found hanging in UP's Pilibhit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11120027_1002_11120027_1616476781288.png)
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జయప్రకాశ్ స్పష్టం చేశారు.
యువతుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ప్రమాదంలో యువకుడు మృతి- పోలీసులపై దాడి