ETV Bharat / bharat

Bodies Identification: ఆర్మీకి అది సవాలే- వారిని దిల్లీకి రప్పించి..

Bodies Identification: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రమాద తీవ్రత కారణంగా ఆ మృతదేహాలను గుర్తించడం ఆర్మీకి చాలా కష్టంగా మారింది.

Bodies Identification
ఆర్మీకి అది సవాలే, Bodies Identification
author img

By

Published : Dec 9, 2021, 6:18 PM IST

Updated : Dec 9, 2021, 7:10 PM IST

Army on chopper crash: ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాదం అనంతరం.. మృతులను గుర్తించడం సైన్యానికి పెను సవాల్​ విసురుతోంది. ప్రమాద తీవ్రత కారణంగా.. అందులో ప్రయాణించిన వారి మృతదేహాలను కనుగొనలేకపోతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వారి గుర్తింపు కోసం సాధ్యమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.

ఇందుకోసం బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను దిల్లీకి రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపులో వారికి అవసరమైన సహాయం, మద్దతు ఇస్తామని తెలిపారు. డీఎన్​ఏ టెస్టింగ్​తో అదనంగా.. కుటుంబ సభ్యులు గుర్తించిన వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించారు.

Bodies Identification: గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సైనిక లాంఛనాలతో అప్పగించనున్నట్లు వెల్లడించారు.

హెలికాప్టర్​ క్రాష్​లో మరణించిన వారి భౌతికకాయాలను.. వెల్లింగ్టన్​లోని మిలిటరీ ఆస్పత్రి నుంచి మద్రాస్​ రెజిమెంటల్​ సెంటర్​కు తరలించారు.

General Bipin Rawat Chopper Crash

బుధవారం జరిగిన ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులతో పాటు మరో 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఘటనకు గల కారణాలపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది.

ఇవీ చూడండి: నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

ఆర్మీ హెలికాప్టర్ క్రాష్​కి ఒక్క నిమిషం ముందు వీడియో

అప్పట్లో శత్రు విమానాలను హడలెత్తించి.. ఇప్పుడిలా విగతజీవిగా...

Last Updated : Dec 9, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.