కేరళకు చెందిన మత్స్యకారుల పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు.. ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కర్ణాటకలోని మంగళూరు తీరానికి 43 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పడవను ఓ కార్గోషిప్ ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెల్లడించారు.
గల్లంతైన వారి కోసం..
పడవలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. వారి ఆచూకీ కోసం నేవీ, వైమానిక దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఐఎఫ్బీ రబ్బా అనే ఈ పడవ కేరళలోని బేపుర్కు చెందిన జాఫర్ అనే వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి : నైట్ వాచ్మెన్ స్థాయి నుంచి ఐఐఎంలో ప్రొఫెసర్గా..