ETV Bharat / bharat

ఘోర ప్రమాదం.. గంగా నదిలో పడవ బోల్తా.. ఏడుగురు గల్లంతు - అదుపుతప్పి బోల్తా కొట్టిన పడవ

గంగా నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురు ఒడ్డుకు చేరుకున్నారు. బిహార్​లో జరిగిందీ ఘటన.

boat capsized in ganga river
బోటు ప్రమాదం
author img

By

Published : Dec 30, 2022, 10:00 PM IST

బిహార్​లోని పట్నాలో ఘోర ప్రమాదం జరిగింది. గంగానదిలో ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 14 మంది ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మహ్వీర్ తోలా ఘాట్ సమీపంలో జరిగిందీ ఘటన.

ఈ పడవ ప్రమాదంలో ఏడుగురు గల్లంతవ్వగా.. మరో ఏడుగురు ఈత కొట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం ఎస్​డీఆర్​ఎఫ్, ఎన్​డీఆర్​ఎఫ్ దళాలు ఆపరేషన్​ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

కార్గో నౌక బోల్తా..
ఆరు ట్రక్కులతో వెళ్తున్న కార్గో నౌక.. గంగా నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. బిహార్​లోని కటిహార్​లో ఈ ఘటన వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు జరిగిందీ ఘటన. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్గో నౌక.. దిలీప్ బిల్డ్​కాన్ కంపెనీ(డీబీఎల్​)కి చెందినదిగా అధికారులు తెలిపారు. ఈ కంపెనీ సాహిబ్​గంజ్​, మణిహారి మధ్య గంగానదిపై వంతెన నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.