డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో మాదిరిగానే సీబీఎస్ఈ బోర్డు సెమిస్టర్ విధానాన్ని ప్రారంభించనుంది. 2021-22 విద్యాసంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించటంతో పాటు సిలబస్‌ను కూడా రెండు భాగాలు చేయనుంది. ఒక పరీక్షను నవంబర్- డిసెంబర్, 2021లో మరో పరీక్షను మార్చి- ఏప్రిల్, 2022 లో నిర్వహిస్తామని బోర్డు డైరెక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యూల్ తెలిపారు.
"సబ్జెక్టు నిపుణుల సమక్షంలో సిలబస్ మొదటి సెమిస్టర్లో 50శాతం, చివరి సెమిస్టర్లో మరో 50శాతం సిలబస్ విభజిస్తాం. సిలబస్ ప్రకారం.. ఒక్కో సెమిస్టర్ పూర్తయ్యాక చివర్లో పరీక్షలు నిర్వహిస్తాం. అంతర్గత పరిశీలన, ప్రాక్టికల్, ప్రాజెక్టు వర్క్‌లో విద్యార్థుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయిస్తాం."
-- జోసెఫ్ ఇమ్మాన్యూల్, బోర్డు డైరెక్టర్
కొవిడ్-19 మహమ్మారి కారణంగా గతేడాది కొన్ని పరీక్షలు రద్దు కాగా.. ఈ ఏడాది మొత్తం పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది.
ఇదీ చదవండి: రూ. 0 నోటు వెనకున్న కథ తెలుసా?