ETV Bharat / bharat

నల్ల పసుపు-నల్ల గోధుమలతో ఆరోగ్యం.. ఆదాయం - ఐశర్య ఖమారి,

సాధరణంగా వంటింట్లోని ఆవాలు, నల్లనువ్వులు, మినుములు నలుపు రంగులో ఉంటాయి. అయితే.. పసుపు, గోధుమలు సైతం నలుపు రంగులో ఉంటాయని ఎప్పుడైనా విన్నారా? అందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నాడు వీటిపై పరిశోధనలు చేస్తున్న ఒడిశా వాసి. మామూలు పసుపు కన్నా 20 రెట్ల సుగుణాలతో పాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే నల్ల పసుపుతో పాటు నల్ల గోధుమలపై ప్రత్యేక కథనం మీకోసం.

black wheat and turmeric crops are grown in odisha by a young  farmer
నల్ల పసుపు-నల్ల గోధుమల పంటలు పండిస్తోన్న యువ రైతు..
author img

By

Published : Mar 13, 2021, 9:43 AM IST

నల్ల పసుపు-నల్ల గోధుమల పంటలు పండిస్తోన్న యువ రైతు..

మార్కెట్లో దొరికే పసుపు.. పచ్చరంగులో ఉంటుంది. గోధుమలు.. గోధుమ రంగులోనే ఉంటాయి. మరి.. నలుపు రంగు పసుపు, గోధుమల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నల్లపసుపు, నల్లగోధుమలు.. రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే పంటలుగా మారాయి. మామూలు గోధుమలతో పోలిస్తే.. నల్ల గోధుమల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి.

వంటింట్లో వాడే పసుపుతో పోలిస్తే నల్ల పసుపు పూర్తిగా భిన్నమైనది. ఈ పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సుగుణాలు దీంట్లో ఉన్నాయి. నల్లపసుపులోని యాంటీయాక్సిడెంట్లు జ్వరం, కీళ్లనొప్పులు, చర్మవ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒడిశా, సంబల్‌పూర్‌లోని ఓ యువ రైతు ఈ రెండు ఉత్పత్తులను పండిస్తూ.. రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నేను వృక్ష శాస్త్రవేత్తను. టిష్యూ కల్చర్‌పై పరిశోధన చేస్తున్నాను. ఈ విధానాల ద్వారా రైతులకు అందకుండా కనుమరుగైపోతున్న వివిధ రకాల మొక్కల పెంపకాన్ని ఇప్పటికే ప్రారంభించాను. బయోటెక్నాలజీ విధానంలో ఉత్పత్తి చేసిన మొక్కలను రైతులకు అందిస్తున్నాను.

-దివ్యరాజ్ బెరిహా, వ్యవసాయవేత్త

కరోనా తర్వాత ప్రజలందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో.. పరిశోధనలు చేసి, కనుమరుగైపోతున్న నల్ల గోధుమను పండిస్తూ, ప్రత్యేక గు‌ర్తింపు తెచ్చుకుంటున్నాడు. నల్ల గోధుమల్లో ఉండే దివ్యమైన ఔషధ గుణాల వల్ల రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ఆదాయ మార్గంగా మారుతుందని చెప్తున్నాడు దివ్యరాజ్.

ఈ నల్ల గోధుమలు ఒడిశాలో మొట్టమొదటిసారిగా పండిస్తున్నాం. పంజాబ్ వ్వవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ విత్తనాలు కనిపెట్టారు. ఒడిశాలో ప్రయోగాత్మకంగా వీటిని సాగు చేస్తున్నారు. ఒడిశాలోని వాతావరణ పరిస్థితులు నల్ల గోధుమలు పండించేందుకు అనుకూలమో కాదో తెలుసుకోవడమే నా ఉద్దేశం. ఈ ప్రయోగంలో విజయం సాధించా. నల్ల గోధుమల్లో ఉండే యాంథోసయనిన్ క్యాన్సర్‌ లాంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగ పడుతుంది. నల్ల గోధుమపిండి కిలోకు 600 నుంచి 700 రూపాయల ధర పలుకుతోంది. గింజలు 12 నుంచి 1500 రూపాయలకు కిలో అమ్ముతున్నారు.

-దివ్యరాజ్ బెరిహా, వ్యవసాయవేత్త

దివ్యరాజ్ స్వయంగా ఓ ఫాంహౌజ్ నిర్మించుకుని, వివిధ రకాల సాగు విధానాలపై అక్కడే పరిశోధన చేస్తున్నాడు. అంతరించిపోయే దశకు చేరుకుంటున్న నల్ల పసుపును కాపాడేందుకు పంట వేశాడు. మామూలు పసుపు కన్నా 20 రెట్ల సుగుణాలు ఈ పసుపులో ఉంటాయని చెప్తున్నాడు.

నల్ల పసుపు అఋడవిలో పండుతుంది. క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంటోంది. నల్ల పసుపు సాగును తిరిగి వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా. టిష్యూ కల్చర్ విధానంలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందుకోసం మూడేళ్లుగా పరిశోధన చేస్తున్నా. చర్మవ్యాధులు, కడుపులో నులిపురుగులు కూడా నల్ల పసుపు వల్ల తగ్గిపోతాయి.

-దివ్యరాజ్ బెరిహా, వ్యవసాయవేత్త

ఈ రెండు పదార్థాల్లో బోలెడన్ని ఔషధ విలువలుంటాయి. మార్కెట్లో అయితే వీటి ధర చాలా ఎక్కువ. నల్ల గోధుమ విత్తనాలను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తెప్పిస్తారు. నల్ల పసుపు దేవఘర్ నుంచి తెస్తారు.

-ఐశర్య ఖమారి, జంతుశాస్త్రం పీహెచ్‌డీ స్కాలర్

ప్రస్తుత పోటీ కాలంలో ఇలాంటి పరిశోధనలు చదువుకున్న రైతులకు, యువతకు మంచి ఉపాధి మార్గాలు చూపుతాయి. అంతేకాకుండా.. ఆరోగ్యపరంగానూ ఎన్నో సమస్యలకు వ్యవసాయ రంగ పరిశోధనలు శాశ్వత పరిష్కారాలు చూపుతాయి.

దివ్యరాజ్ పండించే పంటల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఆధారిత ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇలాంటి పంటల సాగుకు ప్రభుత్వం సైతం ప్రోత్సాహమందిస్తే బాగుంటుంది.

-సుకాంత కార్, స్థానికుడు

ఇవీ చదవండి: రంగురంగుల కాలీఫ్లవర్లతో రైతుకు లాభాల పంట

భిన్న పంటల సమాహారం

ఆనంద్​ ఆఫ్​ కశ్మీర్​గా పుల్వామా- పాల ఉత్పత్తిలో భేష్​​

బైక్​ లవర్​ రోషన్​- 30 బండ్లు సంపాదించెన్​

చరిత్ర మరిచిన తాజ్​మహల్​ 'షేక్ చిల్లీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.