ETV Bharat / bharat

అన్నాడీఎంకే X భాజపా: తమిళనాట 'యాత్ర రాజకీయం'!

తమిళనాడులో 'వెట్రివేల్ యాత్ర'ను చెన్నై పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్ర కొనసాగించేందుకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మురుగున్​ ఒక్కరికే అనుమతి ఇస్తున్నామని, ఆయన మద్దతుదారులు పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

Vetri Val Yatra
వెట్రివేల్ యాత్ర
author img

By

Published : Nov 6, 2020, 1:27 PM IST

తమిళనాడులో 'వెట్రివేల్ యాత్ర'ను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మురుగన్ శుక్రవారం ప్రారంభించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించినా.. యాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

"మత పరమైన విశ్వాసాలు పాటించటం రాజ్యాంగబద్ధమైన హక్కు. యాత్ర నిర్వహించడానికి ఆ దేవుడి అనుమతి మాకు ఉంది. అందుకే యాత్రను ప్రారంభించడానికి నేను తిరుత్తనికి వెళుతున్నా."

- మురుగన్, తమిళనాడు భాజపా అధ్యక్షుడు

అయితే, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మురుగన్ బృందాన్ని చెన్నైలో పోలీసులు అడ్డుకున్నారు. యాత్రను కొనసాగించేందుకు మురుగన్​ ఒక్కరికే అవకాశం ఇచ్చారు. ఆయన మద్దతుదారులను పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

నెలరోజుల యాత్ర..

వెట్రివేల్ యాత్ర నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడులో తిరుత్తని నుంచి తిరుచెందూర్​ వరకు ఆరు మురుగన్​ ఆలయాల మీదగా సాగుతుంది.

కరోనా నేపథ్యంలో వెట్రివేల్ యాత్రకు అనుమతి నిరాకరించినట్లు మద్రాసు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది.

ఇదీ చూడండి: 2021 ఎన్నికల బరిలో కమల్​ హాసన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.