ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా (Modi birthday) దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా టీకాలను పంపిణీ (Vaccination in India) చేయాలని భాజపా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని జన్మదిన వేడుకలు (Modi birthday) ప్రత్యేకంగా నిర్వహించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భావిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వెల్లడించారు.
"ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ పుట్టిన రోజున.. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం కంటే ప్రత్యేకమైనది ఏముంటుంది. మన దేశం తరపున రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్లు ఉండటం గర్వకారణం. వీటి వల్లే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోగలుతున్నాం. కొవిడ్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీకి ఇది మంచి బహుమతి."
-తరుణ్ చుగ్, భాజపా ప్రధాన కార్యదర్శి
రాజకీయ కారణాలతో వ్యాక్సిన్లపై ప్రజలలో అనుమానాలు కలిగిస్తున్న వారికి ఈ టీకా పంపిణీ ద్వారా దీటైన జవాబు చెప్పినట్లు అవుతుందని భాజపా సీనియర్ నేతలు పేర్కొన్నారు.
మొబైల్ వ్యాన్లు ప్రారంభం..
ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు (Modi birthday) సందర్భంగా జైపుర్ ఫూట్ యూఎస్ఏ సంస్థ (jaipur foot USA) గుజరాత్లో మొబైల్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా దివ్యాంగులకు ఉచితంగా ప్రోస్థటిక్ ఫిట్మెంట్స్ను పంపిణీ చేయనుంది. బుధవారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో వీటిని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఎనిమిది మంది సిబ్బందితో తొలి మొబైల్ వ్యాన్ను ప్రధాని సొంతూరైన వాద్నగర్కు తరలించారు.
ఇదీ చూడండి : 'అలా అయితేనే పెళ్లిచేసుకుంటాను'.. పీఎం, సీఎంకు లేఖ!