ETV Bharat / bharat

ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక - భాజపా ప్రధాన కార్యదర్శి

ఉత్తరాఖండ్​ భాజపాలో తలెత్తిన సంక్షోభంపై భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్​ కుమార్ గౌతమ్ నేతృత్వంలోని బృందం అధిష్ఠానానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో దిల్లీ రావల్సిందిగా భాజపా నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​కి పిలుపు అందింది.

BJP's central observers submit report to party high command over Uttarakhand crisis
ఉత్తరాఖండ్​ రాజకీయ సంక్షోభంపై నివేదిక.. దిల్లీకి సీఎం
author img

By

Published : Mar 8, 2021, 2:35 PM IST

ఉత్తరాఖండ్​ భాజపాలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నియామకమైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్​ కుమార్ గౌతమ్, ఉత్తరాఖండ్​ వ్యవహారాల బాధ్యుడు రమణ్​ సింగ్​లు తమ నివేదికను అధిష్ఠానానికి సమర్పించారు. రాష్ట్ర భాజపాలో వరుస ఘటనల నేపథ్యంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వెల్లువెత్తాయి.

గతవారం అత్యవసరంగా నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో దుష్యంత్ గౌతమ్​తో పాటు.. రమణ్​ సింగ్​, త్రివేంద్ర సింగ్ రావత్, అజయ్ భట్, నరేష్ భన్సల్, మాలా రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్​లో పరిస్థితులపై చర్చించారు. ఈ క్రమంలో అధిష్ఠానానికి నివేదికను అందజేశారు.

నివేదిక సమర్పించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి రావత్​.. దిల్లీకి రావాల్సిందిగా పిలుపు వచ్చింది. ఈ మేరకు ప్రత్యేక విమానంలో సోమవారం ఆయన దిల్లీకి బయలుదేరి వెళ్లారు.

మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్​ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేగాక సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్​ భాజపాలో అసమ్మతి తలెత్తింది.

ఇదీ చదవండి: కేరళలో బంగారం స్మగ్లింగ్ మాటేమిటి?: షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.