ETV Bharat / bharat

యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు - యోగి ఆదిత్యనాథ్​కు అధిష్ఠానం మద్దతు

యూపీ భాజపాలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు సంపుర్ణ మద్దతు ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. నేతల అభిప్రాయాలను పార్టీ స్వీకరిస్తుందని, అయితే ఈ విభేదాలు ప్రజల్లో పార్టీ ఇమేజ్​ను దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. యోగి సర్కారు విజయాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు సూచించింది.

BJP's Central leadership backs Yogi Adityanath, quells murmurs in Uttar Pradesh,
యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు
author img

By

Published : Jun 2, 2021, 5:02 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను చెక్ పెట్టేందుకు భాజపా(BJP) అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. కొందరు పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. సీఎం యోగి ఆదిత్యనాథ్​(Yogi adityanath)కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీలో విభేదాలు ఉంటే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. నేతల అభిప్రాయాలను పార్టీ స్వీకరిస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసింది. అయితే, నేతల మధ్య విభేదాలు ప్రజల్లో పార్టీ ఇమేజ్​ను దెబ్బతీయకూడదని తేల్చి చెప్పింది.

రంగంలోకి ప్రధాన కార్యదర్శి

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి పట్టునిలుపుకోవాలని పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో సమస్యలపై భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లఖ్​నవూలో వివిధ నేతలతో చర్చిస్తున్నారు.

మంత్రులు, నేతల నుంచి ఫీడ్​బ్యాక్ తీసుకోవడమే కాకుండా.. వారి అసంతృప్తిని వెళ్లగక్కేందుకూ అవకాశం ఇచ్చారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ కట్టడి, ప్రజల్లో అసంతృప్తి, నేతలు- ప్రభుత్వం మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలను వీరంతా పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తమ దృష్టంతా యోగి సర్కారు విజయాలపైనే ఉంచాలని సంతోష్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు లేఖ రాశారు. ఇటీవల యూపీలో కరోనా కేసులు సైతం తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారును అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు.

రక్తంతో లేఖ

మరోవైపు, యోగి ఆదిత్యనాథ్​ను సీఎం పదవి నుంచి తొలగించవద్దని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీ కార్యకర్త సోనూ ఠాకూర్ రక్తంతో లేఖ రాశారు. యోగిని సీఎంగా తొలగిస్తే పార్టీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

supporter of cm yogi wrote letter to bjp national president jp nadda with blood
రక్తంతో రాసిన లేఖ

ఇదీ చదవండి- ఆపరేషన్​ యూపీ: దిల్లీకి ఆర్​ఎస్​ఎస్​ చీఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.