ETV Bharat / bharat

అభ్యర్థుల ఎంపికపై భాజపా సీఈసీ చర్చ

అసోం, బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో సమావేశమైంది. ఈ భేటీకి ప్రధాని మోదీ సహా కీలక నేతలు హజరయ్యారు.

author img

By

Published : Mar 13, 2021, 9:57 PM IST

Updated : Mar 13, 2021, 10:19 PM IST

BJP' held CEC meeting  to finalise list of candidates
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

అసోం, బంగాల్​ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మిగతా అభ్యర్థులను ప్రకటించడానికి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. నాలుగు రాష్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరఫున అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కావడం ఇది రెండో సారి.

అసోం, బంగాల్​లో జరుగనున్న మొదటి, రెండో విడత పోలింగ్​కు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. బంగాల్​లో 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్​6న ఒకే దఫాలో పోలింగ్​ జరగనుంది.

ఇదీ చదవండి: అసోం సీఎం ఎంపికకు భాజపా 'ఎంపీ​' ఫార్ములా!

Last Updated : Mar 13, 2021, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.