ETV Bharat / bharat

డ్రగ్స్‌ కేసు చుట్టూ బంగాల్‌ రాజకీయాలు! - బంగాల్​లో భాజపా వ్యూహాలు

బంగాల్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యదర్శి డ్రగ్స్​ కేసు భాజపాలో అలజడి సృష్టిస్తోంది. తాను నిర్దోషినని.. సొంత పార్టీ నేతలే తనను ఇరికించారని పమేలా గోస్వామి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్​ చేస్తున్నారు.

bjp-youth-leader-pamela-arrested-in-drugs-case-accuses-party-colleague-of-conspiracy
బెంగాల్‌ డ్రగ్స్‌ కేసు చుట్టూ రాజకీయం!
author img

By

Published : Feb 20, 2021, 8:20 PM IST

బంగాల్​లో డ్రగ్స్​ తరలిస్తూ పట్టుబడిన భాజపా యువమోర్చా నేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బంగాల్‌ ఎన్నికల వ్యవహారాల బాధ్యుడు కైలాష్‌ విజయ్‌ వర్గీయ అనుచరుడు రాకేశ్‌ సింగ్‌ పేరు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. రాకేశే తనను ఇరికించాడంటూ డ్రగ్స్‌తో పట్టుబడిన పమేలా గోస్వామి ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకే సంబంధమూ లేదని రాకేశ్‌ సింగ్‌ చెప్పగా.. ఇదే అదునుగా భావించిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై విమర్శలు గుప్పిస్తోంది.

సీఐడీ దర్యాప్తుకు పట్టు..

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)కు చెందిన పమేలా గోస్వామి, ఆమె స్నేహితుడు ప్రదీప్‌ కుమార్‌ శుక్రవారం కొకైన్‌తో పట్టుబడ్డారు. లక్షలాది రూపాయల విలువైన మాదకద్రవ్యాలను కారులో తరలిస్తుండగా వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను సిటీ కోర్టుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. కైలాష్‌ విజయ్‌ వర్గీయ అనుచరుడు రాకేశ్‌ సింగ్‌ ఇదంతా చేయించారని, సీఐడీ చేత దర్యాప్తు చేయించాలని కోరారు.

హస్తం-టీఎంసీ కుట్ర: రాకేశ్‌ సింగ్

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, కోల్‌కతా పోలీసులు కలిసి ఈ నాటకం ఆడుతున్నారని రాకేశ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆమె చేత బలవంతంగా తన పేరు చెప్పించారని, కొద్దికాలంగా ఆమెతో అసలు మాట్లాడడం లేదని చెప్పారు. తృణమూల్‌ పార్టీ ఆదేశానుసారం పోలీసులు ఈ ఉచ్చు బిగిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు.

తృణమూల్​ విసుర్లు..

మరోవైపు డ్రగ్స్‌ అంశంపై తృణమూల్‌ స్పందిస్తూ.. గతంలో ఓ భాజపా నేత చిన్నారుల అక్రమ రవాణా కేసులో పట్టుబడగా.. తాజాగా మరో నేత డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థఛటర్జీ ఆరోపించారు. భాజపా నేతల నిజస్వరూపం ఇది అని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఈ కేసు మరిన్ని మలుపులు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: మాదకద్రవ్యాల కేసులో బీజేవైఎం నాయకురాలు అరెస్ట్

'అమిత్‌ షా'కు బంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు

'బంగాల్​కు కావాల్సింది తమ సొంత కూతురే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.