ETV Bharat / bharat

'అసోంను మరోసారి అలా కానివ్వం' - అసోం ఎన్నికలు కాంగ్రెస్​

అసోంలోని చిరాంగ్​ జిల్లాలో పర్యటన సందర్భంగా హోంమంత్రి అమిత్​ షా ఏఐయూడీఎఫ్​ చీఫ్ అజ్మల్​పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో మరోసారి చొరబాట్లకు భాజపా అవకాశం ఇవ్వదని పేర్కొన్నారు. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మరోవైపు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్​కు ట్రాక్​ రికార్డ్​ ఉందంటూ ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీ గువాహటి పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

అసోం ఎన్నికలు అమిత్​ షా, amitshah in assam elections
కేంద్ర మంత్రి అమిత్​ షా
author img

By

Published : Mar 31, 2021, 3:59 PM IST

అసోంను మరోసారి చొరబాట్లకు స్వర్గధామంగా భాజపా మారనివ్వదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా అన్నారు. గత ఐదేళ్లలో చొరబాట్లకు భాజపా ప్రభుత్వం చెక్​ పెట్టిందని తెలిపారు. అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తన చేతుల్లో ఉందన్న ఏఐయూడీఎఫ్​ చీఫ్​ అజ్మల్​ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాళం, తాళం చెవి (ఏఐయూడీఎఫ్​ పార్టీ గుర్తు) ప్రజల వద్ద ఉందని పేర్కొన్నారు. చిరాంగ్​ జిల్లాలో బుధవారం జరిపిన పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.

"అసోంలో చొరబాట్లను భాజపా కట్టడి చేసింది. మాకు మరో ఐదేళ్లు ఇవ్వండి.. రాష్ట్రాన్ని చొరబాట్లు, వరద రహితంగా మారుస్తాం. జాగ్రత్తగా వినండి అజ్మల్.. అసోంను మరోసారి చొరబాటుదార్లకు స్వర్గధామంగా మారనివ్వము. తన పార్టీ గుర్తును పేర్కొంటూ అజ్మల్​ అసోం ప్రభుత్వ ఏర్పాటు తన చేతుల్లో ఉందని అంటున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ తాళం, తాళం చెవి ప్రజల వద్ద ఉన్నాయి. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో వారే నిర్ణయిస్తారు."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని కూడా షా విమర్శించారు. విహారయాత్రకు వచ్చినట్లు రాహుల్​ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. అజ్మల్​ అసోంకు గుర్తింపు అన్న రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. శ్రీమంత శంకరదేవ, భారత​ రత్న గోపీనాథ్​ బోర్దోలోయ్​, భూపేన్​ హజోరికా రాష్ట్రానికి ప్రత్యేకం అని, వారి స్థానాన్ని అజ్మల్​ భర్తీ చేయలేరని తెలిపారు.

'కాంగ్రెస్​ ట్రాక్​ రికార్డ్​'

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కాంగ్రెస్​కు మంచి ట్రాక్​ రికార్డ్​ ఉందని తెలిపారు ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీ. భాజపా ఇచ్చిన హామీలను మర్చిపోతుందని, తమ పార్టీ అలా కాదని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఉపాధి, సీఏఏ, టీ తోట కార్మికుల వేతనం, ఉచిత విద్యుత్​, గృహిణులకు ఆర్థిక సాయంపై ఇచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. గువాహటిలో బుధవారం జరిపిన పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.

ఇదీ చదవండి : భారత్​పై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదికి పదేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.