ETV Bharat / bharat

'బంగాల్​లో భాజపాకు శరాఘాతమే' - బంగాల్​ ఎన్నికలు

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఘోర ఓటమి తప్పదని గూర్ఖాల్యాండ్​ జనముక్తి మోర్చా(జీజేఎం) నేత బిమల్​ గురంగ్​ వ్యాఖ్యానించారు. కూచ్​బిహార్​ కాల్పుల ఘటన ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

Bimal Gurung
బంగాల్​లో కమలానికి శరాఘాతమే
author img

By

Published : Apr 12, 2021, 7:16 AM IST

భారతీయ జనతా పార్టీకి కూచ్​బిహార్​ కాల్పుల ఘటన తీవ్ర నష్టాన్ని కలిగించబోతోందని గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం)లోని ఓ వర్గం నేత బిమల్​ గురంగ్​ తెలిపారు. బంగాల్​ ఉత్తర ప్రాంతంలో మరో నాలుగు దఫాల్లో జరగనున్న పోలింగ్​పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, ఓటర్ల ఆగ్రహాన్ని భాజపా చవిచూడక తప్పదని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారాయన.

గూర్ఖాల్యాండ్​కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామనే హామీతో గత 12 ఏళ్లుగా భాజపా ఓట్లు పొందుతూ.. ఇక్కడి ప్రజలను వంచిస్తోందని గురంగ్​ ఆరోపించారు. 2009 నుంచి భాజపా ఎంపీలను డార్జిలింగ్​ లోక్​సభ స్థానం నుంచి గెలిపించినా తమకు చేసిందేమీ లేదన్నారు. గతేడాది అక్టోబర్​లో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏను వీడిన బిమల్​ గురంగ్​.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు సన్నిహితమయ్యారు. డార్జిలింగ్​, దాని పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి శాశ్వతమైన రాజకీయ పరిష్కారం కనుగొందామని టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారని తెలిపారు.

54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..

అమాయకులైన కూచ్​బిహార్​ ప్రజలు కేంద్ర సాయుధ బలగాల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు గురంగ్​. ఈ చర్య వల్ల బంగాల్​ ఉత్తరం పరిధిలోని 8 జిల్లాల్లో ఉన్న 54 శాసనసభ నియోజకవర్గాల్లో భాజపా వ్యతిరేక ఫలితాలను చవిచూడనుందని పేర్కొన్నారు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 8 లోక్​సభ స్థానాల్లో ఏడింటిని జీజేఎం మద్దతుతో భాజపా గెలుచుకుందని గురంగ్​ గుర్తు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కమలం పార్టీకి ఇక్కడ ఎదురుగాలి వీస్తుందని, ఓటర్లపై కాల్పుల ఘటన దీనికి మరింతగా ఆజ్యం పోసిందని వివరించారు. భాజపా విజయం సాధించిన 7 లోక్​సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పదని పేర్కొన్నారు. జీజేఎంలోని రెండు వర్గాల నేతలు.. బినయ్​ తమంగ్​, బిమల్​ గురంగ్​ ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీకి మద్దతిస్తున్నారు.

నాలుగో దశలో 79.90 శాతం పోలింగ్

బంగాల్​లో శనివారం జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో 79.90 శాతం పోలింగ్​ నమోదైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. 5 జిల్లాల పరిధిలోని 44 నియోజక వర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. హింసాత్మక ఘటనలు జరిగిన కూచ్​బిహార్​ జిల్లాలో అత్యధికంగా 84.76 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల ప్రధాన కమిషనర్​గా సుశీల్​ చంద్ర!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.