బంగాల్ ఎన్నికల వ్యూహంపై చర్చే ప్రధాన అజెండాగా బుధవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ(భాజపా) కీలక భేటీ నిర్వహించనుంది.
ప్రస్తుతం బంగాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ ర్యాలీలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ కీలక భేటీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ భాజపా అధ్యక్షుడు కైలాశ్ విజయ వర్గీయ సహా.. పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: సువేందుపై మమత గురి- నందిగ్రామ్ నుంచి పోటీ