ETV Bharat / bharat

'నన్ను ఇంటికి పరిమితం చేసేందుకు భాజపా యత్నం'

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. తనను ఇంటికే పరిమితం చేయాలని భాజపా చూస్తోందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే.. తన కాలికి గాయం చేశారని ఆరోపించారు. అంతకుమందు సీపీఎం తనపై దాడికి పాల్పడేదన్న మమత.. ఇప్పుడు భాజపా దాడులు చేస్తోందని విమర్శించారు.

mamata benarjee slams on bjp
నన్ను ఇంట్లోనే ఉంచాలని చూస్తున్నారు: దీదీ
author img

By

Published : Mar 17, 2021, 3:20 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ముందు.. భాజపా తనను ఇంట్లోనే ఉంచాలని చూస్తోందని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకే.. ఆ పార్టీ వాళ్లు తనను గాయపరిచారని అన్నారు. ఝార్​గ్రామ్​ జిల్లా గోపివల్లవ్​పుర్​లో చక్రాల కుర్చీలో కూర్చొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమత.

"ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. నన్ను ఇంటికే పరిమితం చేయాలని భాజపా యత్నిస్తోంది. అందుకే వాళ్లు నా కాలికి గాయం చేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను దాడికి గురయ్యాను. అంతకుముందు సీపీఎం నాపై దాడి చేసేది. ఇప్పుడు భాజపా చేస్తోంది. వాళ్లు నా గొంతును నొక్కివేయలేరు. భాజపాను మేము ఓడిస్తాం. మీరు మా అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నాకు వేసినట్లే."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

2019 లోక్​ సభ ఎన్నికల్లో ఘార్​గ్రామ్​ నుంచి భాజపా గెలిచినా.. ఏమీ చేయలేదని మమత విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాల గురించి వివరిస్తూ ఆమె ఓట్లు అభ్యర్థించారు.

ఇదీ చూడండి:బంగాల్​ బొగ్గు స్కాంలో మరొకరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.