ETV Bharat / bharat

గుజరాత్‌ పుర పోరులో భాజపా జోరు - gujarat municipal election results 2021

గుజరాత్‌ పుర పోరులో భాజపా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం ఆరు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కమల దళానికి పూర్తి స్థాయిలో మెజారిటీని కట్టబెట్టారు. మొత్తం 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 466 చోట్ల భాజపాదే ఆధిక్యం.

BJP set to retain power in six Gujarat municipal corporations
గుజరాత్‌ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జోరు
author img

By

Published : Feb 23, 2021, 7:01 PM IST

గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా సత్తా చాటింది. ఆరు కార్పొరేషన్​లలో 576 డివిజన్లకు ఈ నెల 21న ఎన్నికలు జరగ్గా.. మంగళవారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాజపా 466 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కేవలం 45 డివిజన్లకే పరిమితమైంది. సూరత్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనూ ఆధిక్యాన్ని కనబరచలేకపోయింది. కొత్తగా పోటీలో నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ 27 డివిజన్‌లలో దూసుకుపోతోంది. మరో నగరపాలక సంస్థ రాజ్​కోట్​లో మొత్తం 72 స్థానాలకు గాను.. 68 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. 4 డివిజన్లకు మాత్రమే హస్తం పార్టీ పరిమితం అయ్యింది.

అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్ కార్పొరేషన్‌లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ కార్పొరేషన్‌లు అన్నీ భాజపా సిట్టింగ్‌ స్ధానాలే. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చినందున గుజరాత్‌ భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఇదీ చూడండి: గుజరాత్ 'స్థానికం'లో భాజపాదే హవా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.