ETV Bharat / bharat

'భాజపావి పథకాలు... టీఎంసీవి కుంభకోణాలు'

author img

By

Published : Mar 21, 2021, 4:39 PM IST

Updated : Mar 21, 2021, 6:04 PM IST

భాజపా పథకాలతో నడుస్తోంటే.. టీఎంసీ మాత్రం కుంభకోణాలతో నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బంగాల్​లోని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... మమతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

BJP runs on schemes, TMC runs on scams: PM Modi at poll rally.
'స్కాంలతో నడుస్తోన్న తృణమూల్ ప్రభుత్వం'

భాజపా పథకాలతో నడుస్తోంటే.. టీఎంసీ మాత్రం కుంభకోణాలతో నడుస్తోందని బంగాల్​లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పదేళ్ల క్రితమే మమత అసలు రంగు బయటపడుంటే.. బంగాల్ ప్రజలు ఆమెను ఎన్నుకునేవారు కాదని అన్నారు. బంగాల్​లోని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు.

BJP runs on schemes, TMC runs on scams: PM Modi at poll rally.
మోదీ సభలో జనసందోహం

నిజమైన అభివృద్ధి(అసోల్ పరివర్తన్​) త్వరలోనే ప్రారంభం కానుందన్నారు మోదీ. బంగాల్​లో అవినీతిని ఇకపై కొనసాగనివ్వమని హామీ ఇచ్చారు.

"బంగాల్​లో డబుల్​ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఓడిపోతానని గ్రహించిన మమత.. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీదీకి నా మఖం ఇష్టం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాసేవనే చూస్తారు.. ముఖం కాదు."

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్ పథకం, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను బంగాల్ ప్రజలకు చేరువ కాకుండా మమత అడ్డుకున్నారని మోదీ మండిపడ్డారు. దీదీ ప్రభుత్వం పదేళ్లు బంగాల్​ ప్రజలతో ఆడుకుంది.. కానీ ఇప్పుడు వారి ఆటలు పూర్తయ్యాయని అన్నారు. త్వరలో వికాస్ (ప్రగతి) ప్రారంభం కానుందని తెలిపారు.

ఇదీ చదవండి : 'ఆ కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయా'

Last Updated : Mar 21, 2021, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.