ETV Bharat / bharat

ఆజాద్​ రాజీనామా దురదృష్టకరమన్న కాంగ్రెస్, భాజపా వెల్​కమ్​

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై విచారం వ్యక్తం చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే, ఆయన రాసిన లేఖలోని విషయాలు వాస్తవం కాదని అభిప్రాయపడింది. మరోవైపు, తన పార్టీలో చేరారని ఆజాద్​ను కోరారు భాజపా నేత ఒకరు.

azad
azad
author img

By

Published : Aug 26, 2022, 2:07 PM IST

Updated : Aug 26, 2022, 3:12 PM IST

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
"గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత. ద్రవ్యోల్బణం, విభజన రాజకీయాలు, పలు అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆయన పార్టీని వీడటం విచారకరం, దురదృష్టకరం" అని కాంగ్రెస్‌ పేర్కొంది. అలాగే ఈ రాజీనామా లేఖలోని విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి వాస్తవం కాదన్నారు. రాజీనామా లేఖలో ఆజాద్.. రాహుల్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వంతోనే తాను పార్టీ నుంచి భారమైన హృదయంతో వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.

వ్యక్తిగతంగానూ ఆజాద్​పై పరుష వ్యాఖ్యలు చేశారు జైరాం రమేశ్. "పార్టీ నేతలందరూ ఆయనతో ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఇలా పార్టీని వీడి వెన్నుపోటు పొడవటం వల్ల ఆయన నిజస్వరూపం బయటపడింది. జీఎన్​ఏ(గులాం నబీ ఆజాద్) డీఎన్​ఏ "మోడి-ఫై" అయింది" అని ట్వీట్ చేశారు కాంగ్రెస్​ సీనియర్ నేత జైరాం రమేశ్.

కాంగ్రెస్‌కు ఇది మామూలు ఎదురుదెబ్బ కాదు..!
గులాం నబీ ఆజాద్ రాజీనామా సమర్పించడం.. కాంగ్రెస్‌కు మామూలు ఎదురుదెబ్బ కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 'ఆయన పార్టీ వీడటం గురించి మొదట్లో పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు మామూలు ఎదురుదెబ్బ కాదు. ఇటీవల కాలంలో హస్తం పార్టీని వీడిన సీనియర్ నేత ఆయన. ఆయన రాజీనామా లేఖ చదవడం బాధగా అనిపించింది. భారతదేశంలోని పురాతన పార్టీలో ఈ పరిణామాలు భయానకంగా కనిపిస్తున్నాయి' అని అన్నారు అబ్దుల్లా.

"కాంగ్రెస్ స్వీయ విధ్వంసం, ఆత్మాహత్య మోడ్​లో ఉంది.​ రాహుల్​ ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టాలి. గులాం నబీ ఆజాద్​ ఎప్పుడైనా మా పార్టీలోకి రావచ్చు. ఒక వేళ అధిష్ఠానం ఆ బాధ్యతలను మాకు అప్పచెబితే మేము ఆయన్ను మా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు భాజపా నేత కుల్​దీప్ బిష్ణోయ్.

ఇదీ చదవండి:

రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం, ఆ తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం ఓకే

రైల్వే ఎగ్జామ్ కోసం బ్లేడుతో బొటనవేలి చర్మాన్ని తొలగించి, స్నేహితుడి వేలికి అతికించి

Last Updated : Aug 26, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.