ETV Bharat / bharat

BJP Promises In Madhya Pradesh : 'రూ.450కే గ్యాస్ సిలిండర్​.. నెలకు రూ.1250 భృతి'.. మహిళలపై సీఎం వరాల జల్లు

BJP Promises In Madhya Pradesh : శాసనసభ ఎన్నికల ముందు మహిళలపై వరాల జల్లు కురిపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లతో పాటు రూ.450కే గ్యాస్ సిలిండర్​ అందించనున్నట్లు ప్రకటించారు.

bjp promises in madhya pradesh
bjp promises in madhya pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 7:36 PM IST

Updated : Aug 27, 2023, 8:03 PM IST

BJP Promises In Madhya Pradesh : ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు లాడ్లీ బెహ్నా పథకం కింద ఇచ్చే వెయ్యి రూపాయల భృతిని రూ.1,250కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ఆగస్టు నెలలో రూ.450 కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు వివరించారు. శ్రావణ మాసం సందర్భంగా భోపాల్​లో ఆదివారం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు హామీలు ఇచ్చారు.

"శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు నెలలో రాష్ట్రంలోని మహిళలు రూ. 450కే గ్యాస్ సిలిండర్​ను ఇస్తాం. ఆ తర్వాత దీనిపై పూర్తి స్థాయి వ్యవస్థను తీసుకువచ్చి తక్కువ ధరకే అందిస్తాం. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మొదట రూ.250 మహిళల ఖాతాల్లో వేస్తాం. ఆ తర్వాత మిగిలిన రూ.1,000ను సెప్టెంబర్​లో జమ చేస్తాం. అక్టోబర్​ నుంచి రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలు రూ. 1,250 పొందుతారు. ఈ మొత్తాన్ని దశల వారీగా రూ.3000కు పెంచుతాం. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం."

--శివరాజ్ సింగ్ చౌహాన్​, ముఖ్యమంత్రి

ప్రస్తుతం మహిళలకు ఉన్న 30 శాతం రిజర్వేషన్లను 35 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​. ఉపాధ్యాయుుల నియామకాల్లో 50 శాతానికి పెంచుతున్నట్లు వివరించారు. మహిళలు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు పారిశ్రామిక వాడల్లో స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. మహిళల నెలవారీ ఆదాయాన్ని రూ.10,000కు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. అక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని మహిళలకు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న పలువురు మహిళల కాళ్లను కడిగారు. రాఖీ పండుగ నేపథ్యంలో హిందీ సినిమాలోని ఓ పాటను సైతం సీఎం పాడారు.

  • #WATCH | Bhopal, Madhya Pradesh: Chief Minister Shivraj Singh Chouhan says, "In the month of Sawan, we will provide LPG cylinders for Rs 450. After that, I will make permanent arrangements for it.." pic.twitter.com/TDoIJUFvq8

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ ఘాటు విమర్శలు
మరోవైపు, ముఖ్యమంత్రి హామీలపై ఘాటుగా స్పందించారు పీసీసీ చీఫ్​ కమల్​ నాథ్​. మునిగిపోయే పడవను కాపాడుకోవడానికి బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శించారు. 18 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నా.. ప్రజలకు ఏం చేయకుండా ఇప్పడు వాగ్దానాలను ఇస్తోందని ఆరోపించారు.

Madhya Pradesh Assembly Election 2023 : ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్​లో ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా 13.39 లక్షల ఓటర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 7.07 లక్షల మంది మహిళలే ఉన్నారు.

ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్​.. సీఎం బఘేల్​పై దుర్గ్ ఎంపీ పోటీ

పోలీసులపై సీఎం వరాలు.. రొటేషనల్ వీకాఫ్.. 15 లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. అర్హుల కోసం 25వేల ఇళ్లు

Last Updated : Aug 27, 2023, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.