BJP nationwide campaign against Congress: పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం భాజపా- కాంగ్రెస్ మధ్య చిచ్చురేపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది భాజపా. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.
Modi Security Breach: శుక్రవారం దిల్లీలోని రాజ్ ఘాట్(మహాత్మాగాంధీ స్మారకం) వద్ద మౌన దీక్ష చేపట్టారు భాజపా ఎంపీలు. 'భారత్ స్టాండ్స్ విత్ పీఎం మోదీ' అని ఉన్న ప్లకార్డులు పట్టుకొని రెండు గంటలసేపు నిరసన తెలియజేశారు. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.
![BJP plans nationwide campaign against Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14122267_congress.jpg)
![BJP plans nationwide campaign against Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14122267_bjp-congress.jpg)
![BJP plans nationwide campaign against Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14122267_modi-bjp.jpg)
అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్లకు నిరసనగా వెళ్లి మెమోరాండం సమర్పించాలని.. భాజపా వ్యూహాలు సిద్ధం చేసింది.
గుజరాత్లో భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నేతృత్వంలోని బృందం.. గవర్నర్ ఆచార్య దేవ్వ్రతాను కలిసి మెమోరాండం సమర్పించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించాల్సిందిగా కోరారు నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా గవర్నర్‌ను కలిసిన బృందంలో ఉన్నారు.
బంగాల్ భాజపా బృందం గవర్నర్ జగదీప్ ధనకర్ను కలిసి మెమోరాండం అందజేసింది.
![BJP plans nationwide campaign against Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14122267_bjp-congress.png)
గోవాలోని భాజపా బృందం.. గురువారమే గవర్నర్ శ్రీధరన్ పిళ్లైని కలిసింది. మోదీ భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పంజాజ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా నిరసనలు..
BJP Attacks Congress: కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకుగానూ.. దేశవ్యాప్తంగా వరుస నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని భాజపా యోచిస్తోంది.
ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపిస్తున్న భాజపా.. ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించింది.
భాజపా యువజన విభాగం ఆధ్వర్యంలో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గురువారం కొవ్వొత్తుల ర్యాలీలు కూడా జరిగాయి.
![BJP plans nationwide campaign against Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14122267_modi-bjp-congress.jpg)
BJP workers lathi-charged:
ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన కొందరు భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్పుర్లోని తిల్హర్లో జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
PM Punjab Incident:
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేపట్టిన పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. భద్రతా వైఫల్యం కారణంగా.. ఆయన కాన్వాయ్ సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. అక్కడినుంచి వెంటనే దిల్లీకి పయనమయ్యారు. మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సుదీర్ఘకాలం జీవించాలని పలు ప్రాంతాల్లో భాజపా నేతలు గురువారం పూజలు, యాగాలు చేశారు.
![BJP plans nationwide campaign against Cong](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14118806_pp.jpg)
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా మరో త్రిసభ్య కమిటీని నియమించింది.
సుప్రీంలో విచారణ..
మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని ప్రయాణ రికార్డులను వెంటనే భద్రపరచాలని పంజాబ్- హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఇది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాది. ఉన్నతస్థాయి అధికారులతో దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఇవీ చూడండి: 'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. విచారణకు త్రిసభ్య కమిటీ