80 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక బృందం జాబితాను విడుదల చేసిన భాజపా(bjp national executive list).. అదే జోరుతో వివిధ భేటీల నిర్వహణపై కసరత్తులు ముమ్మరం చేసింది(bjp national executive). జాతీయస్థాయి పదాధికారుల సమావేశం ఈ నెల 18న జరగనుంది. దీనికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించనున్నారు. పార్టీలోని అన్ని 'మోర్చా'లకు సంబంధించిన అధ్యక్షులు ఈ భేటీకి హాజరవుతారు.
మరోవైపు జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ నవంబర్ 7 జరిగే అవకాశముంది. కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఈ భేటీ జరగలేదు. కమిటీని పునర్వ్యవస్థీకరించి, తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, నితిన్ గడ్కరీతో పాటు కమలదళ దిగ్గజాలు అడ్వాణీ, మనోహర్ జోషి పేర్లు ఉన్నాయి. వీరందరితో కలిసి ప్రత్యక్ష విధానంలో భేటీని నిర్వహించేందుకు భాజపా సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
తాజా జాబితాలో సీనియర్ నేతలు సుబ్రహ్మణ్యం, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ పేర్లు లేవు. లఖింపుర్ హింసాత్మక ఘటన నేపథ్యంలో వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు, అందుకే వారిని కీలకమైన కార్యనిర్వాహక కమిటీ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
80 మంది సాధారణ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 179 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు.
ఇదీ చూడండి:- ప్రభుత్వాధినేతగా మోదీ సరికొత్త మైలురాయి- 20 ఏళ్లు పూర్తి