BJP MLA Son Robbery Case: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుడౌలీ నియోజకవర్గ భాజపా శాసనసభ్యుడు రామ్ చంద్ర యాదవ్ కుమారుడు అలోక్ యాదవ్‌పై దోపిడీ, దాడి కేసు నమోదైంది. అయోధ్య జిల్లా రామ్‌నగర్ గ్రామానికి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు. శ్యామ్ ఇచ్చిన ఆధారాల సాయంతో దర్యాప్తు సాగిస్తున్నారు.
కొట్టి.. డబ్బు లాక్కుని..: "సోమవారం రాత్రి అలోక్ యాదవ్ సహా మొత్తం నలుగురు ఓ వాహనంలో వచ్చారు. నన్ను తీవ్రంగా కొట్టారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి కాల్చేస్తామని బెదిరించారు. నా దగ్గర ఉన్న రూ.లక్ష నగదుతో ఉన్న సంచిని, కొన్ని దస్త్రాలను లాక్కున్నారు. నేను గట్టిగా అరిచేసరికి సమీపంలోని ప్రజలు వచ్చారు. వెంటనే అలోక్, అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి." అని ఫిర్యాదులో పేర్కొన్నారు శ్యామ్. తనపై మరోసారి దాడి జరిగి ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే రామ్ చంద్ర యాదవ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగుతోందని చెప్పారు అయోధ్య ఎస్ఎస్పీ శైలేష్ పాండే.
ఇదీ చూడండి : 'ఎలక్ట్రిక్ వాహనాలపై తిరగండి'.. పెట్రోల్ ధరలపై ప్రశ్నిస్తే మంత్రి సలహా