ETV Bharat / bharat

'డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న భాజపా'

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ నేత మమతా బెనర్జీ. గురువారం పశ్చిమ్​ మెదినీపుర్​లో ప్రచారం సాగించిన ఆమె.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు స్పందించకుండా.. ఇప్పుడు మాత్రం భారీ ఎత్తున ప్రచారసభలు చేపడుతున్నారన్నారు.

BJP leaders lure voters with bagful of cash during polls: Mamata
డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న భాజపా: మమత
author img

By

Published : Mar 18, 2021, 3:48 PM IST

బంగాల్​లో 'ఆంఫన్​' తుపాను బీభత్సం సృష్టించిన సమయంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కేంద్రం సహకారం అందించకపోయినప్పటికీ.. తుపాను ప్రభావంతో నష్టపోయిన వారిలో ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారందరికీ లబ్ధి చేకూర్చామని పశ్చిమ మెదినీపుర్​ ప్రచార సభలో తెలిపారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు స్పందించని భాజపా నేతలు.. ఎన్నికల వేళ హెలికాప్టర్లు, విమానాలలో వచ్చి ప్రచారాలు చేపడుతున్నారని విమర్శించారు. ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఎత్తున డబ్బులు గుమ్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

విపత్తుల సమయంలో టీఎంసీ సర్కార్​ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రజలకు అండగా నిలిచిందని మమత అన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ భాజపా దూరంగానే ఉంటుందని చెప్పారు. భాజపాను అల్లర్ల పార్టీగా అభివర్ణించిన ఆమె.. తాము అహింసా మార్గంలోనే ముందుకు వెళతామన్నారు. ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.