ETV Bharat / bharat

'నకిలీ ఫిర్యాదులు చేసేవారిపై కఠిన చర్యలు!'

author img

By

Published : Mar 14, 2021, 2:20 PM IST

క్రిమినల్​ కేసుల్లో నకిలీ ఫిర్యాదులను అరికట్టేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఓ భాజపా నేత.. సుప్రీం కోర్టులో పిల్​ దాఖలు చేశారు. అలాంటి తప్పుడు విచారణల వల్ల బాధితులుగా మారిన వారికి పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.

BJP leader moves SC, seeks strict action against fake complainants in criminal cases
'నకిలీ ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

క్రిమినల్​ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును భాజపా నేత ఒకరు కోరారు. అటువంటి తప్పుడు విచారణల వల్ల ఇబ్బందులు పడ్డవారికి పరిహారం చెల్లించేలా నిర్దేశించాలని కోరారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన భాజపా నేత కపిల్​ మిశ్రా... ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

జనవరి 28న అలహాబాద్​ హైకోర్టు ఓ రేప్​ కేసులో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కపిల్​ మిశ్రా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన విష్ణు తివారీపై 2000 సంవత్సరంలో ఓ మహిళ అత్యాచార ఆరోపణలు మోపింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అలహాబాద్​ హైకోర్టు విష్ణు తివారీని నిర్దోషి అని తేల్చింది. భూవివాదం కారణంగానే సదరు మహిళ.. తివారీపై తప్పుడు ఆరోపణలు మోపిందని పేర్కొంది. 2000 సెప్టెంబర్​ 16న తివారీని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.

'ఆత్మహత్యలకు పాల్పడతారు'

ప్రత్యేక చట్టాల కింద విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించడానికి ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని కపిల్​ మిశ్రా తన వ్యాజ్యంలో కోరారు. నకిలీ ఫిర్యాదులను దాఖలు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని అన్నారు. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ తీర్పు చదువుతుంటే తలనొప్పి వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.